‘చంద్రబాబు పెద్ద కట్టప్ప.. నాదెండ్ల మనోహర్‌ చిన్న కట్టప్ప’

16 Nov, 2023 10:32 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను నాదెండ్ల భాస్కర్‌ చదువుతున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే, నాదెండ్ల భాస్కర్‌ చిన్న కట్టప్ప అని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, గుడివాడ అమర్నాథ్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘పవన్‌తో పాటు, నాదెండ్ల మనోహర్‌ కూడా ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్‌ కల్యాణ్‌కు మనోహర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే.. మనోహర్‌ చిన్న కట్టప్ప. టీడీపీ పాలనలో జీఎస్‌డీసీ 22వ స్థానంలో ఉంది. నేడు జీఎస్‌డీపీ ఒకటో  స్థానంలో ఉంది. జీఎస్‌డీపీ అనేది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చింది. 

తలసరి ఆదాయం టీడీపీ హయాంలో 174వ స్థానంలో ఉండగా.. నేడు తొమ్మిదో స్థానంలో ఉంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ద్వారా లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. MSME ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించాం. టీడీపీ పాలనలో వ్యవసాయం రంగంలో 27 స్థానంలో ఉన్నాము. నేడు ఆరో స్థానంలో రాష్ట్రం ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే నేడు మూడో స్థానంలో ఉంది. గుజరాత్ తరువాత మన రాష్ట్రంలో పెట్టుబడులు అధికంగా వచ్చాయి.

ఈజ్‌ ఆఫ్ డుయింగ్‌లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎంఎస్‌ఎంఈకి పెద్ద పీట వేశారు. గత ప్రభుత్వం కన్నా ఎంఎస్‌ఎంఈ రంగంలో 650 శాతం అభివృద్ధి సాధించింది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగులో 20 వేల కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ క్లియరెన్స్ ఇచ్చారు. ఉన్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తున్నాము. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్‌ను నిర్మిస్తున్నాం’ అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ప్రజలతోనే మా పొత్తు: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు