ఇంద్ర కీలాద్రిపై భవానీ భక్తుల ఇక్కట్లు

14 Oct, 2013 14:37 IST|Sakshi

విజయవాడ : కనకదుర్గమ్మ ఆశీస్సుల కోసం ఇంద్రీకీలాద్రికి సోమవారం భవానీ భక్తులు పోటెత్తారు.  తిధి ప్రకారం దసరా ఉత్సవాలు ముగిసినా... భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు. ప్రభుత్వం ప్రకటించిన తేదీ ప్రకారం నేడు దసరా కావడంతో అమ్మవారిని దర్శించడానికి భక్తులు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. దసరా పండుగ రోజు దీక్ష విరమించడానికి భవానీలు వేలాదిగా తరలిరావడంతో క్యూలెన్లు కిక్కిరిసిపోయాయి. మరోవైపు అధికారులు పత్తాలేకపోవడంతో భక్తులు మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా విఐపిల సేవలో అధికారులు తరిస్తున్నారని, సామాన్య భక్తులను పట్టించుకోవట్లేదని విజయవాడలో భవానీలు ధ్వజమెత్తుతున్నారు. పిల్లలు, వృద్ధులతో లైన్లలో గంటలకు గంటలు నిలబడ్డా .. కనీసం మంచినీరు కూడా అందివ్వట్లేదని భక్తులు మండిపడుతున్నారు. సౌకర్యాలు కల్పించడంలో కనకదుర్గ దేవస్థానం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ముగియడంతో .. భవానీమాలధారులు, భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. అయితే, రద్దీకి సరిపడా ఏర్పాట్లు చేయకపోవడంతో .. భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

మరిన్ని వార్తలు