ఇది వైద్యుడి ఉద్యమం

13 Apr, 2018 12:05 IST|Sakshi
మున్సిపల్‌ కార్యాలయం ఎదుట పోరాటం చేస్తున్న డాక్టర్‌ రాజారావు

మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట 5 రోజులుగా హోదా సాధన పోరాటం 

రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు

సాక్షి ప్రతినిధి,తిరుపతి : ఈయన పేరు డాక్టర్‌ బీవీ రాజారావు. తిరుపతిలో పేరున్న డాక్టర్‌. ఈయ న్ని కలిసే రోగులూ ఎక్కువే. రోజువారీ సంపాదన కూడా బాగానే ఉంటుంది. ఏసీ రూములో కూర్చుని రోగుల్ని పరీక్షించి రోజుకు రూ.50 వేల కు తగ్గకుండా సంపాదించుకోవచ్చు. ఒకమాటలో చెప్పాలంటే సుఖవంతమైన జీవితం. 
అయితే...
డాక్టర్‌ రాజారావు ఈ తరహా జీవితాన్ని కోరుకోవడం లేదు. మనం తెలుగు గడ్డపై పుట్టి, తెలుగువాడిగా పెరిగి రాష్ట్రానికి ఏం చేశామని ప్రశ్నించుకుంటున్నారు. ప్రత్యేక హోదా సాధన తన కర్తవ్యమంటూ పోరాటం మొదలు పెట్టారు. ఎవరు కలిసొచ్చినా, రాకపోయినా తాను మా త్రం పోరాటాన్ని వీడబోనని స్పష్టం చేస్తున్నారు. చెప్పడమే కాదు.. ఆస్పత్రి వదిలి రోడ్డు మీదకొచ్చి తిరుపతి మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట ఐ దు రోజులుగా ఆత్మగౌరవ ఉద్యమం చేస్తున్నారు. 
ఇది ప్రజా వేదిక...
సమాజంలో ప్రతి ఒక్కరూ దేశం, రాష్ట్రం కోసం బాధ్యతగా ఆలోచించాలన్నదే డాక్టర్‌ బీవీ రాజారావు అభిప్రాయం. వృత్తి ఏదైనా పౌరుడిగా రాష్ట్రం కోసం పోరాడాలన్నదే ఆయన నినా దం. ఇందుకోసం ఒంటరి పోరు ప్రారంభించా రు. ప్రజలు, రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడిగా ఒకే వేదికపై పోరాటం చేసేందుకు అనువుగా ప్రజావేదికను ఏర్పాటు చేశారు. అందులోనే తాను కూ ర్చుని, రండి...ఉద్యమిద్దామని పిలుస్తున్నారు. హోదా విషయంలో చంద్రబాబు ఆడిన డ్రామాలను వివరిస్తున్నారు. ఇది ప్రజా వేదిక.. ఇక్కడ ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చని చెబుతున్నారు. వేసవి గాలులు, ఉక్కపోతను భరిస్తూనే పోరాటం చేస్తున్నారు. రోడ్డున పోయే పరిచయస్తులను పిలిచి, హోదా అవసరాన్ని వివరించి వారినీ ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తున్నారు. ఐదురోజులుగా సు మా రు ఐదువేల మందితో భావాలు పంచుకున్నారు. 
వేదిక దగ్గరే ఉచిత వైద్యం...
హోదా సాధన పోరు చేపట్టిన డాక్టర్‌ రాజా రావు వేదిక వద్దనే ఉచిత వైద్యాన్ని చేస్తున్నారు. రోజూ వేదిక దగ్గరకొచ్చే యాచకులు, పేదలు, అనాథలు, ఏ ఆదరణ లేని వృద్ధులకు ఉచితంగా వైద్యం చేస్తున్నారు.  యాచకులు, పేదలకు అర్థమయ్యేలా తెలుగులోనే ప్రిస్క్రిప్షన్‌ రాసి, రుయా ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. 
గ్రామాల్లోకి వెళతా...పల్లెజనాన్ని కదిలిస్తా...
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పల్లెల్లోనూ కొనసాగిస్తానని డాక్టర్‌ రాజారావు అంటున్నారు. రో జుకు నాలుగైదు గ్రామాలకు వెళ్లి అక్కడి పల్లె జనానికి హోదా అవసరాన్ని తెలియజేస్తానని చె బుతున్నారు. పల్లెల్లో ఉద్యమ పోరును ఉధృతం చేస్తేనే కేంద్రం కదలి వస్తుందని అంటున్నారు. అన్ని పార్టీలూ ఒకే వేదికపై ఆమరణ దీక్ష చేయాలని, నేరుగా సీఎం చంద్రబాబే స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆమరణ దీక్షకు పూనుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమని ఆయన అంటున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అల్లుడిని చంపిన మామ

అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చిండమా..! : సీఎం జగన్‌

చినుకు పడితే చెరువే..

బాపట్లవాసికి జాతీయ అవార్డు!

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స

ఆ వంతెన మొత్తం అంధకారం

మేఘాలే తాకాయి.. ‘హిల్‌’ హైలెస్సా..

ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి

చీకటిని జయించిన రాజు

విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం

ఆ‘ఘనత’ చంద్రబాబుదే..!

దారి మరిచాడు..ఆరు కిలోమీటర్లు నడిచాడు

విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు?

అవనిగడ్డలో పెరిగిన పాముకాటు కేసులు!

కాటేసిన కరెంట్‌ తీగ

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

అక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌

నీట్‌లో సత్తా చాటిన సందీప్‌

రిసార్టులు, పార్కుల్లో అలంకరణకు ఈత చెట్లను..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

పద్నాలుగేళ్ల పోరాటం.. బతికేందుకు ఆరాటం 

‘నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’

మిషన్‌కు మత్తెక్కింది

ఓటీపీ చెప్పాడు.. లక్షలు వదిలించుకున్నాడు

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

సీబీఐ దాడి..జీఎస్టీ అధికారి అరెస్ట్‌ 

ఒకే సంస్థకు అన్ని పనులా!

రెవెన్యూ అధికారులే చంపేశారు

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

ట్రిపుల్‌ ఐటీ పూర్వ విద్యార్థికి లక్ష డాలర్ల వేతనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..