నేను రణ్‌బీర్ కపూర్‌కి చాలా పెద్ద అభిమానిని: మహేష్‌ బాబు

27 Nov, 2023 23:22 IST|Sakshi

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలివుడ్‌ సూపర్‌స్టార్‌ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విఛ్చేసారు. ఇక యానిమల్ మూవీ టీమ్ నుంచి రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.
 
ఈ సందర్బంగా మహేష్ బాబు మాట్లాడుతూ యానిమల్‌ ట్రైలర్‌ చూసి నాకు మెంటలొచ్చేసింది. ఇంత ఒరిజనల్‌ ట్రైలర్‌ నేనెప్పుడూ చూడలేదు. డైరెక్టర్ సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. తను చాలా స్పెషల్‌, యూనిక్‌ డైరెక్టర్. దేశంలోనే సందీప్ ఓ ఒరిజనల్‌ ఫిల్మ్‌ మేకర్‌ అన్నారు.

అలానే ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ తాను రణ్‌బీర్ కపూర్‌కి చాలా పెద్ద అభిమానిని అని చెప్పడం విశేషం. ఇంతకుముందు కూడా ఈ విషయం రణ్‌బీర్‌కి చెప్పాను. కానీ అతడు దాన్ని అంత సీరియస్‌గా తీసుకున్నట్లు లేడు. ఈ స్టేజ్ పై మరోసారి చెబుతున్నాను. నేను రణ్‌బీర్‌కి వీరాభిమానిని. ఇండియాలోనే అతడు బెస్ట్ యాక్టర్. యానిమల్ చిత్రంలో తను అత్యుత్తమ నటన కనబరిచాడు. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్ అని మహేష్ అన్నాడు. ఇక డిసెంబర్‌ 1వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు