ఇద్దరూ ఇద్దరే..

4 Oct, 2018 07:44 IST|Sakshi
సస్పెన్షన్‌కు గురైన ఎస్సై అమ్మనరావు వీఆర్‌కు వెళ్లిన సీఐ వెంకునాయుడు

డుంబ్రిగుడ ఎస్‌ఐ, అరకు సీఐలపై ఆరోపణల వెల్లువ

రోడ్లపైనే సాయుధ పోలీసుల ప్రతాపం

మారుమూల పల్లెల వైపు తొంగిచూడని వైనం

సాక్షి, విశాఖపట్నం: వీర్‌కు కేటాయించిన అరకు సీఐ వెంకునాయుడు, సస్పెండ్‌కుగురైన డుం బ్రి గుడ ఎస్‌ఐ అమనరావు  విధి నిర్వహణ ఏ పాటిదో తెలియజేస్తూ ఒక్కొక్కటిగా వారి ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. మన్యంలో మావోయిస్టుల ఆనుపానులనుకనిపెట్టాల్సిన వీరు అందుకు భిన్నంగా స్థానికులపై ప్రతాపం చూపడంపైనే ఎక్కువ దృష్టి సారించినట్టు  పోలీసు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. అమనరావు విధి నిర్వహణకంటే గంజాయిఅక్రమ రవాణాపై ఎక్కు వ ఆసక్తి చూపేవారని స్థానికులు చెబుతున్నారు. గంజాయి అక్రమరవాణా చేసే వారిని పట్టుకోవడం, వారి నుంచి డబ్బులు గుంజి వదిలిపెట్టడం, గంజాయి అక్రమకేసుల్లో ఇరికిస్తానని బెదిరించ డం వంటివి చేసేవారని తెలిసింది. ఇలా రోజులో ఎక్కువ సమయం గంజాయిపైనే శ్రద్ధ చూపేవారని సమాచారం. అందుకే ఆయనను స్థానికులు గంజాయి డాన్‌గా పరోక్షంగా పిలుచుకునే వారని చెబుతారు. మరోపక్క అరకు సీఐ వెంకునాయుడిపైకూడా చాలాఆరోపణలున్నాయి.

దిగువ స్థాయి సాయుధ సిబ్బందితో రోడ్లపై వెళ్లే వాహనాలను తనిఖీలు చేయించడం,   డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదనో, హెల్మెట్లు లేవనో చెప్పి కేసులు రాస్తామని బెదిరించి సొమ్ము గుంజేవారని స్థానికులు తెలి పారు. ఇలా వారం, పదిరోజులు కాదు.. నిరంత రం ఇదే తీరును కొనసాగించే వారు. అంతేకాదు.. ఉన్నతాధికారుల కోసమని అరకు పట్టణంలోని రిసార్టులు, హోటళ్లలోరోజు రెండుగదుల చొప్పున తమకు కేటాయించుకునే వారని, వాటిని ఇతరుల కు ఇచ్చేవారన్న ఆరోపణలున్నాయి. అరకులో కనీ సం ఒక్కొక్కగది అద్దె రూ.వెయ్యి నుంచి 3 వేల వరకు ఉంది. రిసార్టులు,హోటళ్లుసుమారు 50 వరకు ఉన్నాయి. ఈలెక్కనరోజుకు వీరికి కేటా యించిన వంద గదులకు కనీసం వెయ్యి రూపాయల చొప్పున చూసినా రూ.లక్ష అక్రమార్జనకు ఆస్కారంఉందని స్థానికుల ఆరోపణ. వీరి తీరుపై అరకు పట్టణ, పరిసర ప్రాంత వాసులు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 23న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యల అనంతరం అరకు, డుంబ్రిగుడ పోలీస్‌ స్టేషన్లపై స్థానికులు దాడికి దిగి దగ్ధం చేశారు. వీరిపై ఆగ్రహంతో నే    విధ్వంసకాండ దిగారని పోలీసు ఉన్నతాధికా రులు  తమ విచారణలో తేల్చినట్టు సమాచారం. దీంతో ఘటన జరిగిన రెండు రోజులకే డుంబ్రిగుడ ఎస్‌ఐ అమనరావును సస్పెండ్‌ చేశారు. తాజాగా అరకు సీఐ వెంకునాయుడును రేంజ్‌ వీఆర్‌కు పంపారు. 

మరిన్ని వార్తలు