క్షుద్ర మాంత్రికుల సలహాలతో చెన్నంపల్లి కోటలో తవ్వకాలు

25 May, 2018 11:26 IST|Sakshi
చెన్నంపల్లి కోటలో తవ్వకాలు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, కర్నూలు: జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో నిధుల కోసం గత కొన్ని నెలలుగా అధికారుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఏమి లేదని తెలిసి అధికారులు తవ్వకాలు నిలిపివేశారు. అయితే తాజాగా మళ్లీ కోటలో నిధి వేటగాళ్లు తవ్వకాలు ప్రారంభించారు. నిధి వేటగాళ్లు క్షుద్ర మాంత్రికుల సలహాలతో కోటలో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు తవ్వకాల్లో ఏనుగు దంతాలు, మూడు తలల నాగుపడగ, కొన్ని జంతు కలేబరాల అవశేషాలు మాత్రమే బయటపడటం విశేషం. అదేవిధంగా సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమయ్యాయి. 

రాయుల కాలం నాటి చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో తవ్వకాలకు అనుమతినిచ్చింది. దీంతో పురావస్తు, మైనింగ్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున తవ్వకాలు జరిగాయి. వజ్ర వైఢ్యూర్యాలు, బంగారాన్ని ఈ కోట లోపల దాచి, దానిపై సీసం పోశారని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ భారీ వర్షాలు కురిసిన సమయంలో వజ్రాల కోసం వేట సాగిచండం, కొంత మందికి వజ్రాలు దొరికియాని వార్తలు రావడం తెలిసిందే. అనేకసార్లు ఇక్కడ అక్రమ తవ్వకాలు కూడా జరిగాయి.

మరిన్ని వార్తలు