గడువు పొడిగింపు

1 May, 2018 13:18 IST|Sakshi
కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

విజయనగరం పూల్‌బాగ్‌ : జిల్లాలోని నిరుపేద ఎస్సీ, బీసీ, కాపు, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్, బీసీ ఫెడరేషన్‌ అభ్యర్థులు రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మే పదో తేదీ వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్లు, బ్యాంకు కంట్రోలింగ్‌ అధికారులు, లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్, సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసక్తి గల అభ్యర్థులు మీ సేవ, ఇంటర్నెట్‌ సెంటర్ల ద్వారా గాని, మండల అభివృద్ధి అధికారి, మున్సిపల్‌ కమిషనర్ల కార్యాలయాల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.  

మరిన్ని వార్తలు