టీటీడీలో ప్రొటోకాల్‌ వివాదం.. ఓవీ రమణకు లీగల్‌ నోటీసులు

23 Dec, 2018 13:00 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రోటోకాల్‌ వివాదం రాజుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామికి అవమానం జరిగిందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మండిపడగా.. ఆయనకు తాజాగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ వ్యవహారంలో ఓవీ రమణ తనను అవమానించారంటూ నోటీసులు ఇచ్చారు.

ఈ నోటీసులపై స్పందించిన ఓవీ రమణ.. మీడియా సమక్షంలో క్షమాపణలు చెప్పారు. అయితే, దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామికి జరిగిన అవమానంపై ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ఏపీ సర్కార్‌కు లేఖ రాస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వారంలోపు టీటీడీ స్పందించకుంటే జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తిరుమలలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ఓవీ రమణ ఆరోపించారు.

మరిన్ని వార్తలు