చిరస్మరణీయంగా గండికోట ఉత్సవాలు

10 Jan, 2020 13:31 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున ఆర్డీఓ

రెండురోజుల పాటువైభవంగా నిర్వహణ

భద్రత కోసం వంద సీసీ కెమెరాల ఏర్పాటు

జమ్మలమడుగు: గండికోట ఉత్సవాలు జిల్లావాసులకే కాకుండా ఇతర ప్రాంతాల వారికి కూడా గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీఓ వి.నాగన్న పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో డీఎస్పీ ఎన్‌.నాగరాజు, సీఐలు మంజునాథరెడ్డి, మధుసూదనరావు, ఎంఈఓ చిన్నయ్యలతో కలిసి ఉత్సవాల నిర్వాహణపై చర్చించారు. ఆర్డీఓ  మాట్లాడుతూ ఉత్సవాలకు మన రాష్ట్రానికి చెందిన పర్యాటకులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా వస్తారన్నారు.  ప్రత్యేక ఆకర్షణగా గాయకులతోపాటు, ప్రత్యేక ఆటలపోటీలు, పారాగ్లెడింగ్,బెలూన్, కియాకింగ్, రాక్‌క్లయింబింగ్‌ తదితర విన్యాసాలు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాయలసీమ ప్రాంతాలకు చెందిన కబడ్డీ అల్లెంగుండు ఎత్తడం వంటి పోటీలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం మూడు గంటలనుంచి ఉత్సవాలు ప్రారంభంలో భాగంగా ర్యాలీతో నిర్వహిస్తామన్నారు. డీఎస్పీ నాగ రాజు మాట్లాడుతూ  గండికోట ఉత్సవాలలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా వందకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.   జాయింట్‌కలెక్టర్‌–2 శివారెడ్డి, ఆర్టీఓ అధికారివీర్రాజులు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నుంచి గండికోట వరకు స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు.  

మరిన్ని వార్తలు