పాలిటెక్నిక్‌లో మొదటి ర్యాంకు సాధించిన హర్షిత

15 Oct, 2018 08:10 IST|Sakshi

15న సీఎం చేతుల మీదుగా అవార్డు 

కడప అగ్రికల్చర్‌ : జిల్లాకు చెందిన విద్యార్థిని హర్షిత పాలిటెక్నిక్‌ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచింది. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి అం దరిచేత శభాష్‌ అని పించుకుంది. కడపలోని డ్వామా ప్రాజెక్టులో ఏపీడీగా పనిచేస్తున్న డాక్టర్‌ జాజుల వరప్రసాద్, చిత్తూరు జిల్లా చంద్రగిరి సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.ప్రసూనల కుమార్తె హర్షిత. ఈ విద్యార్థిని తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 2015–18 సంవత్సరంలో సివిల్‌ బ్రాంచ్‌ను పూర్తి చేసింది. ఇటీవల నిర్వహించిన చివరి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 98.41 శాతం మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకుంది. ఇందుకుగాను ఈనెల 15న ఒంగోలు నగరంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభా అవార్డును హర్షిత అందుకోనుంది.
 

మరిన్ని వార్తలు