అందుకే మళ్లీ సీఎంగా వైఎస్‌ జగనే కావాలి: మంత్రి కారుమూరి

9 Nov, 2023 15:29 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారని, అందుకే మళ్లీ సీఎంగా వైఎస్‌ జగనే కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో గురువారం ఆయన ‘వై ఏపీ నీడ్‌ జగన్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో 17వ స్థానంలో ఉన్న విద్యా వ్యవస్థ.. సీఎం జగన్‌ పాలనలో 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

అవినీతి లేని పాలన సీఎం జగన్‌ అందిస్తున్నారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పాలన అందిస్తున్నందుకు మళ్లీ సీఎంగా జగన్ కావాలి. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా అందరికి మేలు చేశారు. జీడీపీ  వృద్ధి రేటులో ఏపీని భారతదేశంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టారు. గతంలోలా మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చి ప్రజలను దోచుకు తినకుండా ఉండాలంటే మళ్లీ సీఎంగా జగనే కావాలి’’ అని మంత్రి కారుమూరి పేర్కొన్నారు.
చదవండి: తెలంగాణలో టీడీపీని ఎందుకు మూసేశారు?: మంత్రి జోగి రమేష్‌

మరిన్ని వార్తలు