ఏడు వాహనాల్లో శ్రీవారు

7 Feb, 2014 04:39 IST|Sakshi
ఏడు వాహనాల్లో శ్రీవారు
  •       పోటెత్తిన భక్తజనం,  రెండు లక్షల మంది హాజరు  
  •      ఉరుకులు పరుగులపై వాహన సేవలు
  •      16 గంటల్లో 7 వాహనాల ఊరేగింపు
  •      {పత్యేక ఆకర్షణగా వేద విద్యార్థుల వైదిక హారం
  •      కూడలి ప్రాంతాల్లో భక్తుల మధ్య స్వల్ప తోపులాట
  •  ఒక రోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన శ్రీవారి రథసప్తమి గురువారం అత్యంత వైభవంగా జరిగింది. పదహారు గంటల్లో ఏడు వాహనాలపై మలయప్ప విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ, చంద్రప్రభ, గరుడ, హనుమంత, చిన్న శేష వాహనంపై మలయప్ప మాత్రమే ఊరేగగా, కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో శ్రీదేవి, భూదేవితో కలసి విహరించారు.  అశేష భక్తజనుల గోవిందనామ స్మరణలతో తిరుమల మార్మోగింది.
     
    సాక్షి, తిరుమల : రథ సప్తమి పర్వ దినాన వాహన సే వలను దర్శించుకునేందుకు భక్తులు మునుపెన్నడూ లేనివిధంగా తరలివచ్చారు. తెల్లవారు జామున 5.30 గంటలకు ప్రారంభమైన సూర్యప్రభ వాహన సేవ  గం ట తర్వాత ఉత్తర మాడవీధి ప్రారంభానికి చేరుకుంది. 45 నిమిషాలు పాటు స్వామివారు సూర్యప్రభ వాహనంపై నిరీక్షించిన తర్వాత ఐదు నిమిషాల పాటు సూ ర్య కిరణాలు స్వామివారి పాదాలను స్పృసించాయి. భానుడినే వాహనంగా మలుచుకున్న దివ్యతేజోమూర్తి మలయప్పను భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు. వాహనం నిలబడిన చోట ఉత్సవ మూర్తికి భక్తులు హారతులు పట్టారు. ఉదయం 7.45 గంటలకు సూర్యప్రభ వాహనం ముగిసింది. అనంతరం 9 గంటలకు చిన్న శేషవాహన సేవ ప్రారంభమైంది. మార్గమధ్యంలో సర్కారు హారతులు మా త్రమే అనుమతించి కేవలం 50  నిమిషాల్లోనే ఊరేగింపు ముగించారు.

    తర్వాత 11గంటలకు గరుడ వా హన సేవ కోలాహాలంగా సాగింది. స్వామివారిని దర్శించుకునేందుకు నాలుగు మాడ వీధులు భక్తులతో కిటకిటలాడాయి. మిగిలిన వాహన సేవలకు సమయాభావంలో ఇబ్బందులు రాకూడదని వాహన సేవ ను 50 నిమిషాల్లోనే ముగించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన హనుమంత వాహనం సరిగ్గా రెండు గంటలకే ముగించారు. అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు సుదర్శన చక్రతాళ్వార్ శ్రీవారి సన్నిధి నుంచి ఊరేగింపుగా వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వైదిక కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత  పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

    తిరుమల జేఈవో శ్రీనివాసరాజు దంపతులు, ఇతర అధికారులు పుష్కరిణిలో పుణ్యస్నానం చేశారు. భక్తులు కూడా సంప్రదాయబద్ధంగా తలపై జిల్లేడు ఆకులు పెట్టుకుని పుణ్యస్నానాలు చేశారు. సాయంత్రం 4 గంటలకు  కల్ప వృక్ష వాహనంపై శ్రీవారు శ్రీదేవి,భూదేవి సమేతంగా పురవీధు ల్లో విహరించారు. సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనంపై ఊరేగారు. చివరగా రాత్రి 8గంటల కు చంద్ర ప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు.
     
    పోటెత్తిన భక్తజనం
     
    ఈ సారి రథసప్తమి వాహన సేవలను దర్శించుకునేం దుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రారంభమైన సూర్యప్రభ వాహన సేవకు ముందుగానే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు. ఉత్తరమాడవీధి నుంచి తూర్పు మాడ వీధి వరకు  భక్తుల మధ్య స్పల్ప తోపులాట చో టు చేసుకుంది. వీరిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బంది పడ్డారు. వాహనసేవల్లో 2 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నట్టు టీటీడీ ఈవో గిరి ధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు.
     
    వేద విద్యార్థులతో వైదిక హారం
     
    బ్రహ్మోత్సవాల తరహాలోనే వాహన సేవల ముందు వీఐపీలు, ఇతర భక్తులు వేచి ఉండకుండా వారిని భక్తితత్పరతతో నియంత్రించేందుకు  వేద  విద్యార్థులతో ప్రత్యేకంగా వైదిక హారాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్ర త్యేక ఆకర్షణగా నిలిచింది. ద్వాదశ పుండ్రాళ్లు (శ్రీ వారి నామాలు) ధరించిన వేద విద్యార్థులు ఎవ్వరినీ నొప్పించకుండా వైదిక హారాన్ని విజయవంతంగా నిర్వహించారు.   
     
    ఆకట్టుకున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలు
     
    రథసప్తమి సందర్భంగా నిర్వహించిన సంగీత, సాం స్కృతిక కళా బృందాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో కర్ణాటక రాష్ట్రం ఉడిపి డప్పు వా యిద్య కళాకారుల విన్యాసం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కోలాటాలు, చెక్క భజనలు, వివిధ దే వతామూర్తుల వేషధారణల్లోని కళాకారుల అభినయ ప్రదర్శనలు భక్తులను ఆనంద పరవశులను చేశాయి.
     
    లక్ష మందికి ఆహార పొట్లాల పంపిణీ
     
    రథసప్తమి సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీ ధులు, దర్శనం కోసం వేచి ఉన్న క్యూలలోని భక్తులకు మొత్తం 50 వేల మందికి పైగా ఆహార పొట్లాలను పం పిణీ చేశారు. పులిహోర, సాంబారు అన్నం, పెరుగు అన్నం, ఉప్మా,  పాలు, టీ, కాఫీ, మజ్జిగ సరఫరా చేశారు. టీడీడీ అన్నదానం డెప్యూటీ ఈవో వేణుగోపాల్, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి ఆలయ వీధులు, క్యూలు తిరుగుతూ వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రథసప్తని సందర్భంగా శ్రీవారి ఆలయం లోపల, ఆలయ పరిసరాలు పుష్ప తోరణాలు, విద్యుదీపాలంకరణలతో భక్తులను విశేషంగా ఆ కట్టుకున్నాయి.
     

మరిన్ని వార్తలు