తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

14 Nov, 2023 08:28 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు సమయం, ప్రత్యేక దర్శనానికి 4 గంటలు పడుతోంది. నిన్న శ్రీవారిని  70,902 మంది భక్తులు దర్శించుకోగా, తలనీలాలు 22,858 మంది సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.24 కోట్లు.

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్‌లో పాలకమండలి సభ్యులు సమావేశం కానున్నారు. వైకుంఠ ఏకాదశిపై పాటు పలు కీలక అంశాలపై పాలకమండలిలో చర్చ జరగనుంది.
చదవండి: వావ్‌..విశాఖ!

మరిన్ని వార్తలు