ఆకట్టుకుంటున్న ఫలపుష్ప ప్రదర్శన

30 Nov, 2013 03:30 IST|Sakshi

తిరుచానూరు, న్యూస్‌లైన్: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రదర్శనశాల ను శుక్రవారం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్ ప్రారంభించారు. అనంతరం అక్కడున్న పురాణాలకు సంబంధించిన కళాకండాలు, కూరగాయలతో రూపొందించిన బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, పుస్తక ప్రదర్శన, విక్రయ స్టాల్‌ను ప్రారంభించారు.
 
ఆకట్టుకుంటున్న కళాకండాలు
 పురాణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని తులాభారం, గజేంద్ర మోక్షం, హిరణ్యాక్షకుడనే రాక్షసు న్ని సంహరించి భూదేవిని కాపాడుతున్న శ్వేత వరాహస్వామి, మారువేషంలో వచ్చి సీతమ్మను భిక్షమడిగే రావణాసురుడు, మహిరావణుడనే రాక్షసున్ని సంహరించి రామలక్ష్మణులను భుజంపై తీసుకెళ్తున్న హనుమంతుడు వంటి సన్నివేశాలకు సంబంధించిన కళాకండాలు ఆకట్టుకుంటున్నాయి. పూలతో అలంకరించిన ఏనుగు బొమ్మ, కూరగాయలతో చేసిన కళాకృతులు కూడా భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
 

మరిన్ని వార్తలు