జననేతకే మళ్లీ జనం పట్టం: అనకాపల్లిలో సభలో వైఎస్సార్‌సీపీ నేతలు

9 Nov, 2023 17:04 IST|Sakshi

సాక్షి, అనకాపల్లి: గత ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని.. కానీ, సీఎం జగన్‌ పాలనలో ఆయా వర్గాలకు పెద్ద పీట వేశారని వైఎస్సార్‌సీపీ కీలక నేతలు చెబుతున్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా.. గురువారం అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించారు వాళ్లు. 

మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..
వైఎస్సార్‌సీపీ సామాజిక చైతన్యయాత్ర సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మళ్ళీ వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. దివంగత నేత వైఎస్‌ పేదల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తే.. వైఎస్‌ జగన్ పది అడుగులు ముందుకు వేశారు. టీడీపీ పాలనలో బడుగు బలహీనవర్గాలకు ఎలాంటి గుర్తింపు లేదు. కానీ, సీఎం జగన్ పాలనలో మాత్రం బడుగు బలహీవర్గాలకు పెద్ద పీట వేశారు. 

ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. 
బడుగు బలహీవర్గాలకు సుమారు లక్ష 50 కోట్ల రూపాయల్ని వాళ్ల వాళ్ల ఖాతాల్లో నేరుగా జమ చేసింది ఈ ప్రభుత్వం. సీఎం జగన్‌ విజనరీ నాయకుడు. సచివాలయం.. వలంటీర్‌ వ్యవస్థల ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదవాళ్ల జీవితాలకు అండగా నిలిచారు. తండ్రి బాటలోనే పయనిస్తూ పాలన చేస్తున్నారు. ప్రజల హృదయాల్లో సీఎం జగన్ ఉన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. 
ఆడవాళ్ళు కు డబ్బులు ఇవ్వడం వలన ప్రజా ధనం వృథా చేస్తున్నారని ప్రతిపక్షాలు  విమర్శలు చేస్తున్నాయి. కానీ, సీఎం జగన్‌ మాత్రం స్త్రీని శక్తివంతురాలుగా తయారు చేస్తున్నారు. జగన్‌ తెచ్చిన ఏ పథకం మంచిది కాదో ప్రతిపక్షాలు చెప్పాలి. అభివృద్ధి అంటే ఒక బిల్డింగ్ కట్టడం కాదు. చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని ఆయన నెరవేర్చలేదు. అలాంటప్పుడు మళ్లీ అధికారం ఎలా అడుగుతారు?. సీఎం జగన్ 99 శాతానికి పైగా హామీలు అమలు చేశారు. 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పేదలు కోసం ఆలోచన చేసిన వ్యక్తి దివంగత నేత వైఎస్సార్‌. ఆయన బాటలో ఆయన కుమారుడు జగన్‌ పయనిస్తున్నారు. 

జగన్ పాలనలో ప్రజలు తమకు పలనాది కావాలని ఎక్కడ ధర్నాలు చేయలేదు. పైగా కోవిడ్‌ లాంటి కష్టకాలంలోనూ ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఆ సమయంలో ఏపీలో ఆకలి చావులు లేవు.  టీడీపీకి ఓటు వేస్తేనే పథకాలు ఇచ్చేవారు. కానీ, జగన్‌ పాలనలో పార్టీలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్నారు. స్వతంత్ర సమరయోధుల్లా జన్మ భూమి కమిటీలకు అధికారాలు అప్పగించారు. ఈ నాలుగేళ్లలో ఇప్పటిదాకా రూ. 2 లక్షల 40 వేల కోట్లు పంపిణీలో ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఎవరు ఆరోపణ చేయలేదు. చంద్రబాబు కూడా సీఎం జగన్‌ పాలనపై అవినీతి ఆరోపణలు చేసే ధైర్యం చేయలేదు.

డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. 
చంద్రబాబు ఆపు నీ నాటకం. నీ మాటలన్నీ బూటకం. సీఎం జగనే మా నమ్మకం. మాకే కాదు.. బడుగు బలహీనర్గాల నమ్మకం కూడా. బడుగు బలహీనర్గాలకు మేలు చేసింది ఆయనే. ప్రజలు కోసమైనా మళ్లీ జగన్ సీఎం కావాలి. ఆయన మానవత్వం ఉన్న మనిషి. ఒక సామాన్యుడిని డిప్యూటీ సీఎం చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ది. మరి చంద్రబాబు తన హయాంలో గిరిజనులకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు. 

ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. 
పేదల కోసం పుట్టిన వ్యక్తి సీఎం జగన్. సామాన్యులను రాజకీయ నాయకులుగా చేసిన ఘనత ఆయనది. జగన్ పాలనలో సామాజిక సాధికారత సాధ్యమైంది. బడుగు బలహీనర్గాలు వారు జగన్ పాలనలో తలెత్తుకొని తిరుగుతున్నారు. ఈ సాధికార యజ్ఞం కొనసాగాలంటే మళ్లీ జగన్ సీఎం కావాలి. చంద్రబాబు మాయ మాటల్ని నమ్మొద్దు. బడుగు బలహీనర్గాలకు సీఎం జగన్ అవసరం ఉంది.

డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. 
బీసీ కులంలో పుట్టిన నన్ను డిప్యూటీ సీఎంను చేసింది సీఎం జగన్. బీసీలకే కాదు.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు.. అన్ని సామాజిక వర్గాలకు పదవులు ఇచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చేయని రీతిలో సామాజిక న్యాయం చేస్తోంది వైఎస్‌ జగనే. కానీ, చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు. తప్పు చేసి చంద్రబాబు జైలుకు వెళ్లి చిప్ప కూడు తిన్నారు. అలీబాబా 40 దొంగల్లా..  రాష్ట్రాన్ని చంద్రబాబు బ్యాచ్ దోచుకుంది.

అంతకు ముందు మంత్రి గుడివాడ అమర్నాథ్ సారథ్యంలో సామాజిక సాధికార యాత్ర ఎన్టీఆర్‌ స్టేడియానికి చేరుకుంది.  భారీగా జనం హాజరు కాగా.. డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ సత్యవతి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డిటి ప్రసాద్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, అదీప్ రాజు, ఉమా శంకర్ గణేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు