-

నష్టం రూ.700 కోట్ల పై మాటే..!

20 Oct, 2014 01:49 IST|Sakshi
నష్టం రూ.700 కోట్ల పై మాటే..!

 హుదూద్ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. కోలుకోలేని  దెబ్బతీసింది. అధికారులు సర్వే చేస్తున్న కొద్దీ పెరుగుతున్న నష్టాల చిట్టాయే దీనికి నిదర్శనం. ప్రాథమిక  సర్వేలోనే రూ.700 కోట్ల మేర నష్టం జరిగినట్టు గుర్తించారు. సర్వే పూర్తయితే 1000 కోట్లు దాటుతుందని... కేంద్రం ప్రకటించిన తాత్కాలిక తుపాను సహాయం రూ.వెయ్యి కోట్లు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోని నష్టాలు పూడ్చేందుకే సరిపడవన్న వాదన వినిపిస్తోంది.
 
 సాక్షిప్రతినిధి/శ్రీకాకుళం పాతబస్టాండ్ : తుపాను జిల్లాపై ఎంత ప్రభావం చూపిందో అధికారుల సర్వేలో నిర్ధారణ అవుతోంది. క్షేత్ర స్థారుులో సర్వేచేసిన అధికారులకు తుపాను నష్టం చెమట్లు పుట్టిస్తోంది. ముందస్తు చర్యలు, టెక్నాలజీతో  తుపానును ఎదుర్కొన్నామని ప్రభుత్వం చెబుతున్నా నష్టాలు తగ్గలేదని పలువురు అధికారులే చెబుతున్నారు. విద్యుత్, వ్యవసాయ రంగం, రోడ్లుకు అపార నష్టం జరిగింది. అన్నదాత కుదేలయ్యూడు. మత్స్యకార బతుకులు ఛిద్రమయ్యూయి. పేదవారి గుడిసెలు నేలమట్టమయ్యూరుు. సీఎం, మంత్రులు పర్యటించినా, అధికారులు హడావుడి చేస్తున్నా ప్రజలకు తాగునీరు, విద్యుత్ సదుపాయూలు, నిత్యావసర వస్తువులు పూర్తి స్థారుులో అందని పరిస్థితి. చాలా ప్రాంతాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. కొన్ని చోట్ల సహాయచర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పంట నష్టాలపై సర్వే జరుగుతోంది. గృహనిర్మాణ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ తదితర శాఖలు మాత్రం నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారుు. మిగిలిన శాఖలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి. పలుశాఖల నష్టాలు ప్రాథమిక అంచనాల్లో అధికారికంగా 700 కోట్లు దాటాయి. వీటిని క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి పూర్తి అంచనాలు తెలిస్తే ఈ నష్టం రూ. 1000 కోట్లు పైబడుతుందని అధికారుల సమాచారం.
 
 491 గ్రామాలపై ప్రభావం
 తుపాను వర్షాలు, నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధ­ృతి జిల్లాలోని 34 మండలాల్లో 491 గ్రామాలపై  ప్రభావం చూపింది. ఇందులో 206 గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నష్టం లెక్కకట్టలేనిది. వరదల్లో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.
 
 పంట నష్టాలు...
 వరి పంట 74,351 హెక్టార్లు, జొన్న 2,680, పత్తి 6,090, చెరకు 3,818, అపరాలు, ఇతర పంటలు 122 హెక్టార్లు.. మొత్తం 87,151 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యానవన విభాగంలో కొబ్బరి 1,082 హెక్టార్లు, జీడిమామిడి 660, కూరగాయలు 376, అరటి 1578, బొప్పాయి 38, మామిడి 24 హెక్టార్లు కలిపి మొత్తం 3,758 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
 
 రోడ్లు, భవనాలు
 పంచాయతీరాజ్ విభాగానికి చెందిన 300 కిలోమీటర్లు రోడ్డు పాడైందని... తాత్కాలిక మరమ్మతులకు రూ.3 కోట్లు, శాశ్వత పరిహారం కోసం రూ.30 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు. రోడ్లు, భవనాల శాఖ విభాగంలోని 820 కిలోమీటర్ల రోడ్లు పాడయ్యాయని, వీటికి  తక్షణ సహాయంగా రూ.7 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ.122 కోట్లు అవసరం ఉందని వివరించారు. మొత్తం జిల్లాలో రోడ్లకు గాను తాత్కాలికంగా రూ.10 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ.152 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు.
 
 విద్యుత్ శాఖ
 జిల్లాలో ఆరు పురపాలక సంఘాలు, 38 మండలాల్లో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. 33 కేవీ సబ్‌స్టేషన్‌లు, 33 కేవీ ఫీడర్లు 32, 11 కేవీ ఫీడర్లు 120, డిస్ట్రిబ్యూటర్ స్టక్చర్స్ 181, 33 కేవీ స్తంభాలు 119, పదకొండు కేవీ స్తంభాలు  860, ఎల్‌టీ పోల్స్ 1500,  11 కేవీ లైన్స్ 425 కిలోమీటర్లు, ఎల్‌టీ లైన్లు 425 కిలోమీటర్లకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 7.30 లక్షల సర్వీసుల సేవలు నిలిచిపోయూయని, ఈ పునరావాస చర్చల్లో 79 బృందాలు, 1300 సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
 
 గృహ నష్టాలు
 పక్కా ఇళ్లు పూర్తిగా 58, తీవ్రంగా 15, పాక్షికంగా 73 మొత్తం 146 ఇళ్లకు నష్టం జరిగింది. పూరిళ్లు పూర్తిగా 253, తీవ్రంగా 1461, పాక్షికంగా 3,702 కలిపి మొత్తం 5,416 ఇళ్లకు నష్టం వాటిల్లింది. మొత్తం జిల్లాలో పక్కా, పూరిళ్లు కలిపి 6,877 ఇళ్లు పాడయ్యాయి.
 
 పశుసంవర్ధకశాఖ
 పెద్దపశువులు 27, చిన్న పశువులు 211, పౌల్ట్రీ సంబంధిత జీవులు 17,500, ఎనిమిది పాడిపరిశ్రమలకు నష్టం వాటిల్లింది. సుమారు 70 లక్షల మేర నష్టం కలిగింది.
 
 మత్స్యశాఖ
 తీరగ్రామాల్లో  వెయ్యి బోట్లకు నష్టం జరిగింది. 300 వలలను నష్టపోయారు. ఈ నష్టం సుమారుగా రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా.
 
 నీటిపారుదల..
 వంశధార, నీటిపారుదల శాఖల్లో 173 పనులకు ఇబ్బందులు వచ్చాయి. వీటిని పూరించేందుకు తాత్కాలికంగా రూ.1.77 కోట్లు, శాశ్వత పరిష్కారానికి 39.105 కోట్లు అవసరమని అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.
 

మరిన్ని వార్తలు