కాకినాడలో భారీ అగ్నిప్రమాదం

2 Jan, 2014 08:40 IST|Sakshi

కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్ధానిక దుమ్ములపేటలో జరిగిన ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు వందకు పైగా మత్స్యకారులకు చెందిన పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నించినా.. చాల సేపటి వరకు మంటలు అదుపులోకి రాలేదు.

 

ఆ అగ్ని ప్రమాదం వల్ల దాదాపు 500 కుటుంబాలు నిరాశ్రులైయారు. ప్రమాదానికి గల కారణాలు తెలియవని అగ్నిమాక అధికారుల చెబుతున్నారు. ఘటనా స్ధలానికి జిల్లా కలెక్టరుతో పాటు పలువురు ఉన్నాతాధికారులు చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్థానికులను విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు