మీ అమ్మను చంపేశా.. వెళ్లి చూసుకో..

16 May, 2015 04:07 IST|Sakshi

భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త
హత్య విషయం ఫోన్‌లో కూతురుకు వెల్లడి

 
 అనంతపురం క్రైం : ‘మీ అమ్మను చంపేశా...వెళ్లి చూసుకో’ అంటూ భార్యను కిరాతకంగా హత్య చేసిన విషయం కూతురుకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. అనంతపురం నగర శివారులోని హమాలికాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గంగాధర్, ఆత్మకూరు రాజమ్మ (43) అనే దంపతులు  హమాలీ కాలనీలో నివాసముంటున్నారు. గంగాధర్ గుత్తి ప్రభుత్వాస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.  రాజమ్మ ఇళ్లలో పని చేస్తుండేది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతుళ్లకు వివాహం చేశారు. వారు ఇదే కాలనీలో నివాసముంటున్నారు. 

తాగుడుకు బాని సై విధులను నిర్లక్ష్యం చేయడంతో అత ని స్థానంలో  కుమారుడు పనిచేస్తున్నా డు. మద్యం కోసం డబ్బు ఇవ్వాలని భార్యను వేధించేవాడు. గురువారం రాత్రి కూడా డబ్బు కోసం భార్యతో గొడవపడ్డాడు. తెల్లవారుజామున రోకలిబండతో భార్య తలపై బలంగా మోది హత్యచేశాడు.  అనంతరం పెద్ద కూతురు అరుణజ్యోతికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె వెళ్లి చూడగాతల్లి విగతజీవిగా పడివుంది.  పోలీసులకు తెలపడంతో వన్‌టౌన్ సీఐ రాఘవన్, ఎస్‌ఐ విశ్వనాథచౌదరి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు