కేజీబీవీల్లో ఇంటర్‌

7 Jun, 2019 12:33 IST|Sakshi
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

ఈ ఏడాది కొత్తగా 21 కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ 

అందుబాటులోకి వృత్తి విద్యా కోర్సులు 

ఉత్తర్వులు జారీచేసిన నూతన ప్రభుత్వం 

నిరుపేద బాలికలకు వరం

అనాథలు.. బడి మధ్యలో మానేసిన బాలికల కోసం మహానేత దివంగత సీఎం వైఎస్సార్‌ 2004–05 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 53 మండలాల్లో కస్తూర్బా బాలికల విద్యాలయాలను ప్రారంభించారు. దీంతో ఎంతోమంది నిరుపేద బాలికలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.  దివంగత నేత        ఆశయాలే స్ఫూర్తిగా పరిపాలన      సాగిస్తున్న నవ్యాంధ్ర నూతన     ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విద్యాలయల్లో సమూల మార్పు తీసుకొచ్చే క్రమంలో భాగంగా జిల్లాలోని 21 కేజీబీవీల్లో ఈ విద్యా  సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యను ప్రారంభించాలని నిర్ణయించారు.   

కర్నూలు  ,ఆళ్లగడ్డ: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు ముందు ఈ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిస్‌ మీడియంలో ఉచిత విద్యతో పాటు హాస్టల్‌ వసతి కల్పిస్తున్నారు. అయితే పదో తరగతి వరకు చదువున్న బాలికలు ఇంటర్‌ విద్యకు దూరమవుతండటంతో పాటు బాల్య వివాహాలు జరుగుతున్నా యి. వారు పదితోనే ఆగకుండా ఉన్నత చదువులు చదవాలని భావించి..ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 140 కేజీబీవీలను అప్‌గ్రేడ్‌ చేసి ఇంటర్మీడియట్, వృత్తి విద్యాకోర్సులు ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 21 కేజీబీవీల్లో మొదటి సంవ త్సరం ఇంటర్మిడియట్‌ ప్రారంభించనున్నారు. 

నిరుపేద బాలికలకు వరం..
కేజీబీవీల్లో పదో తరగతి పూర్తి చేసిన బాలికలు పై చదువులకు దూరమవుతున్నారు. దూర ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలలకు పంపలేని అనేక మంది బాలికల కుటుంబ సభ్యులు వారికి బాల్య వివాహాలు చేస్తున్నారు. అలాంటి బాలికలకు కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య వరంగా మారనుంది. జిల్లాలోని 53 కేజీబీవీల్లో గత సంవత్సరం రెండు చోట్ల ఇంటర్‌ విద్య ప్రవేశ పెట్టినప్పటికీ అవసరమైన సిబ్బంది, వసతులు కల్పించక పోవడంతో ఉపయోగంలోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఇంటర్‌తో పాటు టెక్నికల్, ఉపాధి కోర్సులు ప్రవేశ పెట్టడంతో నిరుపేద బాలికలకు వరంగా మారనుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు