ఇక మంత్రుల ఇళ్ల వద్ద ఆందోళనలు

21 Jun, 2016 02:30 IST|Sakshi
ఇక మంత్రుల ఇళ్ల వద్ద ఆందోళనలు

ప్రభుత్వానికి జర్నలిస్టు సంఘాల హెచ్చరిక

 సాక్షి, నెట్‌వర్క్: సాక్షి చానల్‌పై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై 11 రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా స్పందించకపోవడం దారుణమని జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడకపోతే జర్నలిస్టు సంఘాలన్నీ ఏకమై   తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాయని హెచ్చరించాయి.

సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కూడా నిరసనలు కొనసాగాయి. విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. గురజాడ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రాము మాట్లాడుతూ.. మంత్రుల ఇళ్ల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.  అటు అనంతపురం ఆర్డీవో కార్యాలయం వద్ద జర్నలిస్టులు రిలే దీక్షలను మూడోరోజు కూడా కొనసాగించారు.

>
మరిన్ని వార్తలు