గతంలో అనర్హులకే నందులు.. ఇప్పుడు న్యాయం చేస్తాం: పోసాని

23 Dec, 2023 13:22 IST|Sakshi

సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకే అవార్డులు దక్కాయని ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌, టీవీ, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బీసీ వెల్ఫేర్‌, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు.

ఈ  సందర్భంగా పోసాని మాట్లాడుతూ, నంది అవార్డుల్లో గతంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. ‘‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక నన్ను ఛైర్మన్‌ చేశారు. అర్హులైన వారికి మాత్రమే నంది అవార్డులు ఇస్తున్నాం. కళాకారులకు గుర్తింపునిచ్చే ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. నాటక రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. వర్క్‌షాపులు నిర్వహించి కళాకారులకు ప్రోత్సహిస్తాం’’ అని పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు.

నాటక రంగలో ఇదొక చారిత్ర ఘట్టం: మంత్రి వేణు
మొత్తం 73 అవార్డులు ఇవ్వబోతున్నామని, 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ‘‘నాటక కళాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించాం. నిరుత్సాహంతో ఉన్న కళాకారులకు ఇది గొప్ప అవకాశం. రాష్ట్రంలో అంతరించుపోతున్న కళలను సజీవంగా ఉండాలనేది సీఎం జగన్‌ ఆకాంక్ష. వీధి నాటకాలను సైతం పోత్సహిస్తున్నాం. వెనుకబడిన వర్గాల నుంచి ఎక్కువ మంది నాటక రంగానికి వస్తున్నారు. ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం వల్ల కళాకారులకు మరింత గౌరవం దక్కుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇప్పుడు ఇవ్వనున్న అవార్డులు ప్రతిబింబాలు. నాటక రంగలో ఇదొక చారిత్ర ఘట్టం’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నంది నాటకోత్సవాలు: సీఎం జగన్ 100 అడుగుల కటౌట్ 

>
మరిన్ని వార్తలు