కొత్త భాష.. కొత్త భాష..

22 Jan, 2020 13:24 IST|Sakshi
డిజిటల్‌ లైబ్రరీలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినులు

కొరియాలో ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌కు అవకాశాలు  

ఎచ్చెర్ల క్యాంపస్‌: ప్రపంచం కుగ్రామమైపోయింది. ఉపాధి అవకాశాలు ఎంత సులభంగా వస్తున్నాయో అంతే తొందరగా పోతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో సరైన ఉపాధి అవకాశాలను అన్వే       షించడం విద్యార్థులకు అత్యవసరం. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఈ దిశగా తర్ఫీదు ఇస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. ట్రిపుల్‌ ఐటీ వంటి సంస్థలో ఇంజినీరింగ్‌ చేశాక వంద శాతం ఉద్యోగం లభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీయూసీ కోర్సు నుంచే విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, యాప్స్‌ వంటివాటిపై తర్ఫీదు అందుతోంది. దీంతో పాటు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌ ప్రోత్సహించే విధంగా కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం కొరియా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్‌ రంగాల్లో దూసుకుపోతోంది. ఆ దేశంలో మన విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొరియా భా షను నేర్పించేందుకు వర్సిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా కొరియాలో పనిచేయాలంటే నైపుణ్యంతో పాటు భాష కూడా ప్రధానమే. అందుకే మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్న ఆ దేశంలో పనిచేసే విధంగా, విద్యార్థులను ప్రొత్సహించే దిశగా కొరియా భాషను ట్రిపుల్‌ ఐటీలో పరిచయం చేస్తున్నారు. 

ఉపాధి అవకాశాలు..
రాష్ట్రం యూనిట్‌గా రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో కొరియా భాషను ప్రవేశ పెట్టే చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు కొరియన్‌ కల్చరల్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌తో ఎంఓయూ (ఒప్పందం) కుదుర్చుకున్నా రు. మరో పక్క సౌత్‌కొరియా సంస్థలు కళాశాలలకు వచ్చి క్యాంపస్‌ ఇంటర్వ్యూ లు నిర్వహించటం, భారత దేశంలో పలు ప్రధాన నగరాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేయడం కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, మంచి ప్యాకేజీలకు ఎంపికయ్యే అవకాశాలు లభిస్తాయి.  

విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి
ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ విద్యా సంస్థలో విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రతిభావంతమైన వి ద్యార్థులు ట్రిపుల్‌ ఐటీల్లో చేరుతున్నా రు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యంతో పాటు భాషా నైపుణ్యం అవసరవుతోంది. ఈ నేపథ్యంలో కొరియా వంటి భాషలను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.  – డాక్టర్‌ జి.భానుకిరణ్,శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు