‘సీఎం జగన్‌ది ఆదర్శవంతమైన పాలన’

5 Nov, 2023 17:19 IST|Sakshi

సాక్షి, పలాస(శ్రీకాకుళం జిల్లా):  వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎనిమిదో రోజు ఆదివారం పలాసలో నిర్వహించిన  సామాజిక సాధికారిత బస్సుయాత్రకు ప్రజలు భారీ స్థాయిలో సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా పలాసలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసంగించారు.  జనం భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారం, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంబాల జోగులు, ఎంఎల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘ గత పాలకుల నిర్లక్ష్యం వలన ఇన్నాళ్ళూ ఉద్దానం ప్రాంతం వెనుక బడింది. జగన్ సీఎం అయ్యాక రూ. 75 కోట్ల తో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టాము. 7వందల కోట్ల రూపాయలతో వంశధార తాగునీరు తెచ్చాము. వలసల నివారణకు మూల పేట పోర్ట్ నిర్మాణం చేపట్టాం. వంశధార ఎడమ కాలవకి నీరు రావడం లేదు. అందుకే ఈ ప్రాంతానికి ఇన్సూరెన్స్ వచ్చేలా కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ గతంలో చిన్న చిన్న సమస్యలకు జనం ఉద్యమాలు చేసేవారు. ఇప్పుడు ప్రజా సమస్యలు మేమే పరిష్కరిస్తున్నాం. కిడ్నీ రోగుల సమస్యలు తీర్చడానికి వంశధార ప్రాజెక్ట్ తాగు నీరు అందించాలని అనుకుని ఈ ప్రభుత్వం కాలం లోనే అనుకుని, ఈ ప్రభుత్వకాలంలోనే పూర్తి చేస్తాం. గ్రామ స్థాయిలో అవినీతి తగ్గించాము. ప్రధాన మంత్రులు సైతం అవినీతిని ఆపలేకపోయారు. సీఎం జగన్ అవినీతిని రూపు మార్చగలిగారు. పరిపాలన లో గొప్ప గొప్ప సంస్కరణలు తెచ్చాము.  జగన్ అమలు చేస్తున్న పథకాల వంటి వాటి పై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. ప్రజల జీవన ప్రమాణాలు ఏమేరకు పెంచాలని జగన్ ఆలోచన. మన రాష్ట్రం లో తీసుకొచ్చిన మార్పులు ఓట్ల కోసం కాదు. పిల్లలకు చదువు చెప్పడం ఓట్ల కోసం కాదు. విద్యా ద్వారా పేదరికం తొలగించే పని. ఇది ఆదర్శవంతమైన పాలన’ అని పేర్కొన్నారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తే ప్రతిపక్షానికి నష్టం ఏమిటి?. విద్యార్థులకి ఇస్తున్న విద్యా కానుక, పౌష్టికాహారం, విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్నారు.  ఈ సృష్టి లో ఇద్దరే ఇద్దరు మామలు. ఒకటి చందమామ, రెండు జగన్ మామ.  చదువు పేదవాడి జీవనాన్ని మార్చుతుంది. పేదవాడి ఆరోగ్యం నయం చేసిన ఘనత సీఎం జగన్‌ది. వైద్య రంగం లో సమూలమైన మార్పులు తెచ్చాం’ అని పేర్కొన్నారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు