కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి సమావేశం

29 Oct, 2014 16:04 IST|Sakshi
కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి సమావేశం

హైదరాబాద్: కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ ఎస్‌కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు.

ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చిస్తారు.  కృష్ణా జలాల వినియోగం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా చర్చిస్తారు. బోర్డు అధికారులకు కార్యాలయాల కేటాయింపు, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా చర్చిస్తారు.
**

మరిన్ని వార్తలు