యశోదా ఆస్పత్రిలో కూలిన లిఫ్ట్

13 Jan, 2014 21:02 IST|Sakshi

హైదరాబాద్: ఈ మధ్యన నగరంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఇటీవల పలు అపార్ట్మెంట్లు, శంషాబాద్లోని వీజేఆర్ రెసిడెన్సీ హోటల్‌లో, సెక్రటేరియేట్లో కూడా లిఫ్ట్ ప్రమాదాలు జరిగాయి. ఈ రోజు  సికింద్రాబాద్‌లోని  యశోదా ఆస్పత్రిలో లిఫ్టు ఏకంగా కూలిపోయింది.

ఈ ప్రమాదంలో 11 మందికి  గాయాలయ్యాయి. వారిలో  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే లిఫ్ట్ మొదటి అంతస్థు నుంచి కూలడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లుగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు