సీఎం పర్యటన ఇలా..

17 Nov, 2014 04:24 IST|Sakshi
సీఎం పర్యటన ఇలా..

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నగరంలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ర్ట మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, డాక్టర్ నారాయణ, పరిటాల సునీత, అచ్చన్నాయుడు, మృణాళిని, పల్లె రఘునాథ్ హాజరవుతున్నారు.

* ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
* ఉదయం 11.00 గంటలకు ఎంవీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణమండపం సర్కిల్ వద్ద సామూహిక మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
* మధ్యాహ్నం 12.30గంటలకు కైలాసగిరి చేరుకుంటారు.అక్కడ జరిగే కార్తీక వనమహోత్సవంలో పాల్గొంటారు. సుమారు రెండుగంటల పాటు అక్కడే గడుపు తారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి సహఫంక్తి భోజనాలు చేస్తారు.
* మధ్యాహ్నం  3.00 గంటలకు కలెక్టరేట్‌లో అధికారులతో తుపాను నష్ట అంచనాలు..పరిహారం పంపిణీపై సమీక్ష నిర్వహిస్తారు.
* సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొంటారు.
* సాయంత్రం 5.30 గంటలకు గురజాడ కళాక్షేత్రంలో క్రిస్టియన్ సంఘాలు ఏర్పాటు చేసిన థాంక్స్ టు గివింగ్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సంఘాలు సీఎంను సత్కరించనున్నాయి.
* సాయంత్రం 6.00 గంటలకు ఆర్‌కే బీచ్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘రెజువనేషన్ విశాఖ’ పేరిట నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొంటారు.
* సాయంత్రం 6.40 గంటలకు వుడాపార్కులో సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొన్న  అధికారులు, సిబ్బందికి సన్మాన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం వారితో కలిసి సహఫంక్తి భోజనాలు చేస్తారు.
* రాత్రి 8.30 గంటలకు వుడాపార్కు నుంచి బయల్దేరి ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.
* రాత్రి 9.00 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు.

మరిన్ని వార్తలు