నీకేమో పెళ్లి సంబరాలు.. కానీ నాకు.. సాయి ధరమ్ తేజ్ పోస్ట్ వైరల్!

13 Nov, 2023 12:43 IST|Sakshi

ఇటీవలే టాలీవుడ్‌ జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో జరిగిన వీరి పెళ్లికి మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లిలో రామ్ చరణ్, సాయి ధరమ్‌ తేజ్, అల్లు అర్జున్‌తో సహా నితిన్ కూడా పాల్గొన్నారు. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. వరుణ్ తేజ్‌ పెళ్లిని ఉద్దేశించి చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ పోస్ట్ చూస్తే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిలో సాయి ధరమ్ తేజ్ ఓ రేంజ్‌లో హంగామా చేసినట్లు కనిపిస్తోంది. పెళ్లిలో వరుణ్‌ తేజ్‌ను ఊరేగించే కారుపై కాలు పెట్టిన ఫోటో చూస్తే చాలా ఫన్నీగా కనిపిస్తోంది. అతన్ని చూసిన వరుణ్ తేజ్ చిరునవ్వుతో కనిపించాడు. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చాడు. 

సాయి తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఎందుకు, ‍క్యూన్, యేన్, వై.. ఎంత పని చేశావ్ వరుణ్ బాబు.. ఉష్..నీకు పెళ్లి సంబరాలు.. కానీ నాకేమో స్వతంత్ర పోరాటం' అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు మాత్రం అలాంటి కమిట్‌మెంట్స్ పెట్టుకోకు అ‍న్నా అంటూ సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్. కాగా.. సాయి ధరణ్ తేజ్ ఈ ఏడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.

A post shared by Sai Dharam Tej (@jetpanja)

మరిన్ని వార్తలు