మలి పరుగు

9 Aug, 2014 05:06 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో/ ఉప్పల్:  నగరవాసుల కలల మెట్రోరైలు వరుసగా రెండోరోజూ పరుగులు పెట్టింది. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాగోల్ మెట్రో డిపో నుంచి-సర్వేఆఫ్ ఇండియా వరకు రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గం లో సుమారు 20 కేఎంపీహెచ్ వేగంతో మొత్తం పదికిలోమీటర్లు(ఐదు ట్రిప్పులు) విజయవంతంగా రాకపోకలు సాగిం చినట్లు ఎల్‌అండ్‌టీ అధికారులు తెలిపారు.

ఈ మార్గంలో మెట్రోరైలుకు ఆగి ఉన్నప్పుడు, ఎలివేటెడ్ మార్గంలో పయనిస్తున్నప్పుడు మొత్తం 18 పరీక్షలను నిర్వహించామని, ఆయా పరీక్షలను రైలు విజయవంతంగా పాసైందని వెల్లడించారు. మళ్లీ సోమవారం ప్రయోగపరీక్ష(టెస్ట్న్)ర ఉం టుందని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ యా విడిభాగాలను సరఫరా చేసిన సంస్థలుఅన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించన తర్వాతనే భద్రతా సర్టిఫికెట్లు జా రీ చేస్తాయని.. అప్పుడు ట్రయల్న్ ్రనిర్వహిస్తామన్నారు.
 
60 రోజులపాటు ట్రయల్న్.
ప్రస్తుతం నాగోల్ మెట్రో డిపోలోని నాలుగు మెట్రోరైళ్లతోపాటు త్వరలో కొరియా నుంచి మెట్రోడిపోకు చేరనున్న మరో మూడు రైళ్లను అంటే మొత్తం ఏడు రైళ్లను ట్రయల్న్‌క్రోసం సన్నద్ధం చేస్తామని ఎల్‌అండ్‌టీ అధికారులు తెలిపారు. ట్రయల్న్‌న్రు నాగోల్-మెట్టుగూడా రూట్లో ఎనిమిదికిలోమీటర్ల మార్గంలో 60 రోజులపాటు నిర్వహిస్తామన్నారు.
 
 మెట్రోరైలుకు నిర్వహించిన సాంకేతిక పరీక్షలివే..
 1.    పట్టాలపై రైలు నిలిపి ఉన్నపుడు నాగోల్ డిపోలో స్టాటిక్ టెస్ట్-1
 2.    ఎలివేటెడ్ మార్గంలో పరుగులతీస్తున్నపుడు స్టాటిక్ టెస్ట్స్-2,3,4
 3.    ఎలివేటెడ్ మార్గంలోని ప్రధాన మార్గం(పట్టాలమార్గం) సామర్థ్యాన్ని పరీక్షించడం
 4.    పరుగులు తీస్తున్నపుడు ప్రొపల్షన్ సిస్టం పనితీరు
 5.    మెట్రో రైలు బ్రేకుల పనితీరు
 6.    శబ్దం, కూత, కదుపుల తీరుతెన్నులు
 7.    రైలులో అంతర్గత సమాచార వ్యవస్థ పనితీరు
 8.    రైలు పరుగెడుతున్నపుడు మొత్తం గమనం తీరుతెన్నుల రికార్డింగ్
 9.    {పయాణికులకు సమాచారం అందించే వ్యవస్థ, సీసీటీవీలు, రైలుకున్న హెడ్‌లైట్లు
(10), కంప్రెసర్
(11), రైలు ఆగినప్పుడు, పరుగులు తీస్తున్నపుడు ఆటోమేటిక్‌గా మూసుకొని, తెరుచుకొనే డోర్ల
(12) పనితీరు
 13.రైలులో వెంటిలేషన్, ఎయిర్‌కండిషన్ వ్యవస్థ, విపత్తులు సంభవిస్తే రైలులో వివిధ వ్యవస్థ
(14)ల పనితీరు.
15.రీసెర్చ్ డిజైన్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారం ఆసిలేషన్, అత్యవసర బ్రేకుల పనిచేసే విధానం.
 16. సిగ్నలిగ్, రైలు నియంత్రణ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరు.
 17.ఓవర్‌హెడ్ ట్రాక్షన్ సిస్టం(విద్యుత్ గ్రహించే తీరు)
 18.రిలయబిలిటీ(విశ్వసనీయత), అవైల్యబిలిటీ(సానుకూలత), మెయిన్‌టేనబిలిటీ(నిర్వహణ సామర్థ్యం), భద్రతకు సంబంధించిన ఇతర పరీక్షలు.
 

మరిన్ని వార్తలు