'మంత్రిని మార్చారు సరే టి.బిల్లు....'

15 Jan, 2014 12:26 IST|Sakshi
'మంత్రిని మార్చారు సరే టి.బిల్లు....'

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి తనదైన శైలిలో విమర్శించారు. బుధవారం మధుయాష్కీ హైదరాబాద్లో మాట్లాడుతూ... కిరణ్ సీఎంగా మంత్రుల శాఖలను మార్చే అధికారం ఉండవచ్చు... కానీ తెలంగాణ బిల్లును మర్చే అధికారం మాత్రం ఆయనకు లేదని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు.

 

తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందన్నారు. ఆ వెంటనే రాష్ట్రం ఏర్పాటు అవుతుందని, వెనువెంటనే ఇరు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయని మధు యాష్కి తెలిపారు. అయితే శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబును ఆ శాఖ నుంచి తప్పించి, వాణిజ్య శాఖను కట్టబెడుతూ సీఎం కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ వ్యవహారాల శాఖను ప్రాధమిక విద్యాశాఖ మంత్రి ఎస్.శైలజానాథ్కు అప్పగించారు.

 

దాంతో టి. బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు ఏమిటని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్తోపాటు గవర్నర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సమైక్యవాది అని పేరుపడిన ముఖ్యమంత్రి టి. బిల్లుకు వ్యతిరేకంగా ఏమీ చేయలేరనే ఉద్దేశ్యంతో మధు యాష్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు