నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

20 Feb, 2014 02:01 IST|Sakshi

శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి మార్చి 2వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రోజూ వాహన సేవలు, 27న మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణ మహోత్సవం చేస్తారు. 28న రథోత్సవం నిర్వహిస్తామని ఈవో ఆజాద్ తెలిపారు. ఉ. 9 గంటలకు యాగశాల ప్రవేశం, గణ పతి పూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 24న రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 23 వరకే స్వామివార్ల స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. 24 నుంచి మార్చి 2 వరకు అలంకార దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 20 నుంచి మార్చి 1 వరకు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు.

మరిన్ని వార్తలు