నమ్మించి వంచించడమే చంద్రబాబు నైజం

12 Jun, 2016 01:16 IST|Sakshi

మాలమహానాడు రాష్ర్ట అధ్యక్షుడు పంతగాని రమేష్

 
గుణదల : ఎన్నికలకు ముందు కాపు కులస్తులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించి అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన నైజాన్ని మరోమారు ప్రదర్శించారని, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన కాపు రిజర్వేషన్ అంశంపై బాబు మాట తప్పా రని, ఇది చంద్రబాబుకు అలవాటేనని మాలమహానాడు రాష్ర్ట అధ్యక్షుడు పంతగాని రమేష్ పేర్కొన్నారు. శనివారం గుణదల గంగిరెద్దుల దిబ్బ వద్ద ఉన్న మాలమహానాడు జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు 1956కు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కరే కల్పించారని, అనంతరం రాజకీయ కారణాల వల్ల తరువాత వచ్చిన పాలకులు రాజకీయ లబ్ధికోసం రిజర్వేన్లు తీసేశారన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా, మేనిఫెస్టోలో పొందుపరచిన హామీలపై నిలదీస్తున్న ముద్రగడకు తమ మద్దతు ఉంటుందని, అణచివేతకు గురయ్యే ప్రతి కులానికి, మాలమహానాడు అండగా ఉంటుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్ష్యం గా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.


ముద్రగడ అంశంలో టీడీపీ ప్రభుత్వం అరాచకాలను సృష్టించి రాష్ర్టంలో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారని, శాంతియుతంగా దీక్ష చేస్తున్న ముద్రగడ కుటుంబ సభ్యులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు.  చంద్రబాబుకు కులాల మధ్య, మనుషుల మధ్య చీలికలు తీసుకురావటం అలవాటన్నారు. 1994లో దళితులను వర్గీకరణ పేరుతో చీల్చి మాల, మాదిగలుగా విడదీశారని గుర్తు చేశారు. కాపుల విషయంలోనూ  అదే పునరావృతం అవుతోందన్నారు. బాబు కాపులను చీల్చి ముద్రగడపై కక్షసాధింపులకు గురి చేస్తున్నారన్నారు. 2019లో మాలలు, కాపులు, ముస్లింలు, బీసీలతో కలిసి రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తామని  పంతగాని రమేష్  పేర్కొన్నారు. త

 

 

మరిన్ని వార్తలు