అక్కడ మా విద్యార్థులుండరు కదా!

29 Mar, 2017 02:37 IST|Sakshi

పది ప్రశ్నపత్రాల లీకేజీపై మంత్రి నారాయణ వింత వాదన

సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ విద్యాసంస్థల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలుండటంతో ఈ విషయాన్ని ఎలా కప్పిపుచ్చాలో తెలియక మంత్రులు సతమతమవుతున్నారు. ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇస్తున్నారు. మొదట అసలు ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని దబాయించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనంతరం వాట్సాప్‌లో ప్రశ్నపత్రం వస్తే మంత్రి నారాయణకేం సంబంధం అంటూ వితండవాదం చేస్తున్నారు.

మరోవైపు మంత్రి నారాయణ మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల్లో మా విద్యార్థులు పరీక్ష రాయరు కదా.. అక్కడ ప్రశ్నపత్రం లీకైతే మాకేం సంబంధం? అని చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తామని, ఇప్పటికే విచారణ జరిపించాం.. అంటూ రకరకాల సమాధానాలు ఇస్తున్నారు. లీకేజీ వ్యవహారంపై నారాయణ, పల్లె మంగళవారం మీడియా పాయింట్‌లో మాట్లాడారు.

మరిన్ని వార్తలు