‘ఎర్రదండు’ ముంచింది! | Sakshi
Sakshi News home page

‘ఎర్రదండు’ ముంచింది!

Published Wed, Mar 29 2017 2:36 AM

Farmers, Errajonna traders to buy

బాల్కొండ : ఎర్రజొన్న కొనుగోలు వ్యాపారులు ఎర్రదండుగా ఏర్పడి  రైతులను నిలువునా ముంచారు. ఎర్ర జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వ్యాపారుల సిండికేట్‌ మాయాజాలాన్ని తిప్పి కొట్టాలని రైతులు చేసిన ప్రయాత్నాల్లో కూడా వ్యాపారులే  నెగ్గారు. ఫలితంగా ఎర్ర జొన్నలు అమ్ముకున్న రైతులకు నష్టాలు మిగిలా యి. రెతుల వద్ద నుంచి వ్యాపారులు రూ.2,050లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ.2,350 అమ్ముకుం టున్నారు. ఏటా మాదిరిగా వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల ఆదాయానికి గండి కొట్టారు. గతేడాది క్వింటాలుకు రూ.5 వేల  వరకు ధర పలికింది. కొన్ని గ్రామాల్లో ఈ ఏడా ది ముందస్తుగా క్వింటాలుకు రూ.2,350 వరకు కొం దరు వ్యాపారులు చెల్లించారు. మధ్యలో ఎర్ర దండు దిగి సిండికేట్‌ చేయడం మూలంగా ధరను తగ్గించేశారు. ఏటా రైతుల చేతుల నుంచి వ్యాపారుల చేతిలోకి వెళ్లిన తరువాతనే జొన్నలకు ధర పలకడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

50 వేల ఎకరాల్లో సాగు
ఆర్మూర్‌ డివిజన్‌లో ఎర్రజొన్న పంటను అధికంగా సాగు చే స్తారు. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో ఎర్ర జొన్న సాగైన ట్లు అంచనా. దాదాపుగా 95 శాతం మేర రైతులు ఎర్ర జొన్నలను ప్రస్తుత సంవత్సరం విక్రయించుకున్నారు. అక్కడక్కడ కొందరు రైతులు నిల్వ ఉంచుకున్నారు. నిల్వ ఉంచుకున్నా గతంలో రైతులకు పెద్దగా లాభం చేకూరలేదు. దీంతో రైతులు ప్రస్తుత సంవత్సరం అంతగా నిల్వ చేసుకోలేదు. ప్రతిపంట దిగుబడి ధరలు వ్యాపారుల చేతికి వెళ్లాకనే ధర పెరగడంపై రైతు లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వ్యాపారుల సిండికేట్‌పై, ప్రస్తుతం ధర పెరుగుదలపై ప్రభుత్వం విచారణ చేపట్టి ఎర్ర జొన్న రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఏటా ఇంతే..
ఏటా జొన్నల పరిస్థితి ఇం తే. మేము అమ్ముకున్న త రువాత క్వింటాలుకు రూ. 200 నుంచి రూ.500 వర కు ధర పెరుగుతుంది. పంట మా చేతిల్లో ఉన్నప్పుడు మార్కెట్‌లో ధర లేదంటూ వ్యాపారులు కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడేమో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.
– శ్రీనివాస్, రైతు, వెంచిర్యాల్‌

రైతులను ముంచుటకే..
 వ్యాపారులు రైతులను ముంచుటకే కుట్రలు చేస్తున్నారు. ప్రస్తుత సంవత్స రం కూడా అదే చేశారు. ప్రభుత్వం ఎర్ర జొన్నలను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తేనే రైతులకు ప్రయోజ నం ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో ఎర్ర జొన్న పంటను సాగు చేయలేక పోతాం.
 – మహేందర్‌రెడ్డి, రైతు, రెంజర్ల

Advertisement
Advertisement