పొలాల్లో నడిచి.. మాస్కులు పంచి..

5 May, 2020 10:26 IST|Sakshi
పంట పొలాల్లోంచి నడిచి వచ్చి ఉపాధి కూలీలకు మాస్కులు పంపిణీ చేస్తున్న మంత్రి తానేటి వనిత

పశ్చిమ గోదావరి ,చాగల్లు: మంత్రి తానేటి వనిత సోమవారం మండలంలో పర్యటించారు. ఈ క్రమంలోనే మల్లవరం నుంచి గౌరిపల్లికి కారులో వెళ్తున్న ఆమె పంట బోదెల్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలను గమనించారు. వెంటనే కారు దిగి అర కిలోమీటర్‌ పంటపొలాల్లో నడిచి వారి వద్దకు చేరుకున్నారు. వారికి మాస్కులు అందించి కరోనాపై అవగాహన కల్పించారు.

ఇబ్బందులున్నా పథకాలు ఆగనివ్వం
చాగల్లు: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ఎటువంటి ఆటంకం రాకుండా కృషిచేస్తున్నారని మంత్రి తానేటి వనిత తెలిపారు. మండలంలోని దారవరం, చంద్రవరం, మల్లవరం, గౌరిపల్లి గ్రామాల్లో సోమవారం ఆమె పర్యటించారు. లబ్ధిదారులకు వైఎస్సార్‌ ప్రమాద బీమా చెక్కులు, ఆయా గ్రామస్తులకు మాస్కులు, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందించారు. వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు  కొఠారు అశోక్‌బాబా, డీసీసీబీ ఉపా«ధ్యక్షుడు అత్కూరి దొరయ్య, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు