ఎమ్మెల్యే కొమ్మాలపాటి ముసుగుదొంగ

4 Jun, 2016 01:42 IST|Sakshi
ఎమ్మెల్యే కొమ్మాలపాటి ముసుగుదొంగ

వైఎస్సార్ సీపీ నేత బొల్లా

క్రోసూరు:‘ పెదకూరపాడు శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్ చాల గొప్పవాడు, ఘనుడు అంటూ గతంలో చెప్పుకునేవాళ్లు, ఇపుడే ఆయన చేసిన అక్రమాలతో కొమ్మాలపాటి ముసుగుదొంగ అని తేలిపోయింది’ అని వైఎస్సార్ సీపీ వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. క్రోసూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పానెం హనిమిరెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కొమ్మాలపాటి ముసుగులో చేసిన అక్రమాల గుట్టు రాష్ట్రస్థాయిలో గుప్పుమందన్నారు. సదావర్తి సత్రం స్థలాల కుంభకోణం, ఇసుక అక్రమ వ్యాపారం, అభినందన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని విమర్శించారు. అవినీతి ఎమ్మెల్యే కొమ్మాలపాటిపై సీబీఐ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు.

అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే తహశీల్దార్ వ్యవహరిస్తున్నారని ఆర్డీవో శ్రీనివాసరావుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో మట్టి, ఇసుక దందాలు నానాటికీ పేట్రేగిపోతున్నాయని  ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమంగా కోట్లు గడిస్తునార్నని తెలిపారు.  క్రోసూరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన మశీదు కాంప్లెక్స్ విషయంలో పోలీసు అధికారులు అధికారపార్టీ మాటలు విని మశీదు పెద్దలకు పార్టీలంటగట్టి కేసులు పెట్టడటం దుర్మార్గమని అన్నారు. 

మండల రెవెన్యూ అధికారులు ముడుపులిచ్చేవారికే గుట్టుచప్పుడుగా పనులు చేస్తున్నారని , అధికారపార్టీ నేతల కనుసన్నలలోనే తహసీల్దార్ కార్యాలయం నడుస్తుండటం శోచనీయమని పేర్కొన్నారు. వెబ్‌లాండ్‌లో క్రోసూరు భూములకు  డాట్ పెట్టటంతో  రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని ప్రజలు వాపోతున్నా తహసీల్దార్ మాత్రం పట్టించుకోవటం లేదని తెలిసిందన్నారు.

>
మరిన్ని వార్తలు