ఎవరెస్టు పర‍్వతారోహణ బృందం ఎంపిక

6 Apr, 2017 12:16 IST|Sakshi
ఎవరెస్టు పర‍్వతారోహణ బృందం ఎంపిక

విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఆధ‍్వర్యంలో మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ కోసం ఆరుగురు సభ్యల బృందాన్ని ఎంపిక చేసినట్లు రాష్ట్ర యువజన సర్వీసులశాఖమంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది ఔత్సాహికులకు వివిధ పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనపరిచిన ఆరుగురిని ఎంపిక చేశామని తెలిపారు. ఈ బృందం ఈ నెల 12వ తేదీన మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంప్ నుంచి తమ ప్రయాణం మొదలు పెడుతుందని అన్నారు.

మే 15 నుంచి 25వ తేదీల మధ‍్య ఈ బృందం ఎవరెస్ట్ కు చేరుతుందని అంచనా చేస్తున్నట్లు తెలిపారు. ఎవరెస్ట్ పై భారత పతాకాన్ని ఎగురవేస్తారని తెలిపారు. మొత్తం రూ. రెండు కోట్ల నలభై లక్షల రూపాయలను ఈ మిషన్ కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి పటిష్టమైన శిక్షణ తీసుకున్న అభ్యర్థులను ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం లు అభినందించారు.

మరిన్ని వార్తలు