ఎవరెస్ట్‌ వైపు తొలి అడుగు..

12 Sep, 2023 12:38 IST|Sakshi

కెరమెరి(ఆసిఫాబాద్‌): ఆశయ సాధనకు పేదరికం అడ్డుకాదని నిరుపిస్తున్నాడు.. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం కెలి కె గ్రామానికి చెందిన గిత్తే కార్తీక్‌. సాహస కృత్యాల్లో రాణిస్తూనే, మరోవైపు కళల్లోనూ తన ప్రతిభను చూపుతున్నాడు. తన గమ్యం ఎవరెస్ట్‌ అధిరోహించడమే అని చెబుతున్న కార్తీక్‌.. తాజాగా సిక్కిం రాష్ట్రంలో నిర్వహించే పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యాడు.

తెలంగాణ నుంచి ఐదుగురు..
కెలి కె గ్రామానికి చెందిన గిత్తే రుక్మాజీ, ఇటాబాయి ల కుమారుడు కార్తీక్‌ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. సిక్కింలోని నామ్‌చా జి ల్లాలో ఈనెల 18 నుంచి అక్టోబర్‌ 16 వరకు విద్యార్థులకు పర్వతారోహణ శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణకు తెలంగాణ నుంచి ఐదుగురు ఎంపిక కా గా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి కార్తీక్‌ ఒక్కరే ఉ న్నారు. నెల రోజులపాటు కొనసాగే ఈ కఠినమైన శిక్షణ పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప ర్వతం ఎవరెస్ట్‌తోపాటు కిలిమంజారో వంటి శిఖ రాలు అధిరోహించేందుకు అనుమతి లభిస్తుంది.

ఈ నెల 15న సిక్కింకు బయలుదేరనున్నాడు. కాగా కార్తీక్‌ ఇప్పటికే బోనగిరిలోని రాక్‌లైన్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో జూన్‌ 19న బోనగిరి గుట్టపై 150 ఫీట్ల రా ఫెల్లింగ్‌, 150 ఫీట్ల కై ్లంబింగ్‌తోపాటు 650 ఫీట్ల ఎ త్తు వరకు ట్రెక్కింగ్‌ పూర్తి చేశారు. 30 ఫీట్ల బౌల్‌ట్రెంగ్‌, 10 మీటర్ల జిప్‌లైన్‌లోనూ ప్రతిభ చూపాడు. దీంతో బోనగిరి రాక్‌లైన్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో సి క్కింల్‌లో అందించే శిక్షణకు ఎంపికయ్యాడు. కు టుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు.

మాలావత్‌ పూర్ణ స్ఫూర్తి
13 ఏటనే ఏడు పర్వతాలు అధిరోహించిన నిజామాబా ద్‌ జిల్లాకు చెందిన మాలా వత్‌ పూర్ణను స్ఫూర్తిగా తీసుకుని సాహస కృత్యాల్లో పా ల్గొంటున్నా. ట్రెక్కింగ్‌, కై ్లంబింగ్‌తోపాటు కవితలు రాయడం, చెస్‌ ఆడటం అంటే ఇష్టం. పేదరికంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థికంగా అండగా ఉంటే రాష్ట్రం పేరు నిలబెడతా..
– గిత్తే కార్తీక్‌

ఇతర కళల్లోనూ నేర్పరి
సాహస కృత్యాలతోపాటు కార్తీక్‌ ఇతర కళల్లోనూ నేర్పరి. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. వజ్రోత్సవం సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కవి సమ్మేళనంలో మొదటిస్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ పోటీల్లో పతకం సాధించాడు. ఇచ్చోడలో జరిగిన వాటర్‌ఫాల్‌ పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటాడు. గతంలో నేపాల్‌లో జరిగిన చెస్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాగా ప్రజాప్రతినిధులు, అప్పటి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆర్థికసాయం అందించి ఆదుకున్నారు.

మరిన్ని వార్తలు