ఇల్లు ఖాళీ చేయించడంలో ఉద్రిక్తత

21 Jan, 2017 02:15 IST|Sakshi
ఇల్లు ఖాళీ చేయించడంలో ఉద్రిక్తత

బ్యాంకు వేలంలో ఇల్లు కొన్న ఎంపీ గల్లా జయదేవ్‌

పట్నంబజారు (గుంటూరు): గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఆంధ్రాబ్యాంకు వేలంలో కొనుగోలు చేసిన ఇంటిని అధికారులు ఖాళీ చేయించే విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరులో గుంటుపల్లి శ్రీనివాస్‌ వ్యాపారం నిమిత్తం ఆంధ్రాబ్యాంకులో రూ.2.50 కోట్ల అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చకపోవడంతో గత జూన్‌లో బ్యాంకు అధికారులు ఆయన ఇంటిని వేలం వేశారు. అప్పటికే ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఎంపీ జయదేవ్‌ రూ.3.09 కోట్లకు ఆ  ఇంటిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ కుటుంబాన్ని ఆ ఇంట్లోంచి ఖాళీ చేయించాలని అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు.

అయినా వారు ఖాళీ చేయకపోవడంతో శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో బ్యాంకు అధికారులు.. పోలీసు, రెవెన్యూ అధికారుల సాయంతో ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో శ్రీనివాస్‌ భార్య పద్మ తనకుమారుడు సమంత్‌తో పాటు రెండు లీటర్ల పెట్రోల్‌ తీసుకుని గదిలోకెళ్లి తలుపులు వేసుకు న్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడబోమని చెప్పారు.దీంతో అధికారులు ఆందోళన చెందారు. చివరకు శ్రీనివాస్‌ తండ్రి పూర్ణచంద్రరావు సర్దిచెప్పడంతో పద్మ బయటకు వచ్చారు.  అధికారులు ఇంటిని సీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు