తక్షణం వెయ్యికోట్లు విడుదల చేయాల్సిందే..!

4 Sep, 2016 01:38 IST|Sakshi

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులు

 విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ. 1,000 కోట్లు విడుదల చేసి ఆదుకోవాలని అగ్రిగోల్డ్ బాధితులు డిమాండ్ చేశారు. ఆ తరువాత త్వరితగతిన ఆస్తులను వేలం వేసి పూర్తి స్థాయిలో చెల్లింపులు చేపట్టాలని కోరారు. విజయవాడలో శనివారం రాష్ట్ర సీఐడీ విభాగం ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పలువురు ఏజెంట్లు, కస్టమర్లు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మొదటగా ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు అడ్వాన్స్ ఇచ్చి బాధితులను ఆదుకోవాలని కోరారు. హాయ్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుని వేలం వేయాలని డిమాండ్ చేశారు.

>
మరిన్ని వార్తలు