నా సోదరికి పోలీసుల నుంచి ప్రాణహాని

6 Apr, 2016 00:48 IST|Sakshi

కేసులుంటే కోర్టులో హాజరుపరచండి ..  లేదంటే విడుదల చేయూలి
అన్నపూర్ణ సోదరుడు భూతం వుస్తాన్‌రావు డిమాండ్

 

పిడుగురాళ్ళ మావోయిస్టు అనే ఆరోపణలతో పిడుగురాళ్ళ వుండలం జూలకల్లుకి చెందిన తన సోదరి అన్నపూర్ణ అలియూస్ అరుణ అలియూస్ పద్మక్కను తుళ్లూరు వుండలం తాళ్లారుుపాలెంలో పోలీసులు అరెస్టు చేశారని, ఆమెకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆమె సోదరుడు భూతం మస్తాన్‌రావు ఆరోపించారు. వుస్తాన్‌రావు మంగళవారం పిడుగురాళ్ళ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  తన చిన్న చెల్లెలు అరుున అన్నపూర్ణ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. తన పెద్ద చెల్లెలు వెంకటరత్నం ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతోందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కారులో వచ్చిన కొందరు పోలీసులు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి విజయువాడ వైపు తీసుకెళ్లారని చెప్పారు.

 
అన్నపూర్ణపై కేసులు ఉంటే తక్షణమే కోర్టులో హాజరు పరచాలని, కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయూలని వుస్తాన్‌రావు డివూండ్ చేశారు. గతంలో వుస్తాన్‌రావు మేనకోడలు కువూర్తె అరుున రాయుపాటి స్వర్ణలత అలియూస్ నాగవుణిని పట్టుకుని పోలీసులు కాల్చి చంపిన చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు అదే విధంగా  తన చిన్న చెల్లెలు అన్నపూర్ణ ప్రాణాలకు హాని ఉందని ఆయున ఆందోళన వ్యక్తం చేశారు. 1991లో జననాట్య వుండలి పట్ల ఆకర్షితురాలైన అన్నపూర్ణ ఇంటి నుంచి వెళ్లిపోరుుందని, అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియలేదని, ఇటీవలే రెండు రోజుల క్రితం పెద్ద చెల్లెలు వెంకటరత్నం ఇంటికి వచ్చిన అన్నపూర్ణను పోలీసులు తీసుకెళ్లారని వుస్తాన్‌రావు వివరించారు. ఆమెను వెంటనే కోర్టుకు హాజరు పరచడవూ? లేదా విడుదల చేయుడమో చేయకపోతే పెద్దయెత్తున ఆందోళనకు దిగుతామని ఆయున పోలీసులున హెచ్చరించారు. అన్నపూర్ణతోపాటు తన పెద్ద చెల్లెలు వెంకటరత్నం, బావ బాలస్వామి కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెంటనే విడుదల చేయాలని కోరారు. 

 
అన్నపూర్ణను బేషరతుగా విడుదల చేయాలి: పౌరహక్కుల సంఘం

నరసరావుపేట టౌన్: పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు నాయకురాలు భూతం అన్నపూర్ణను వెంటనే బేషరతుగా విడుదలచేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్జీవో హోమ్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పోలీసుల చర్యను నిరసించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళయ్యపాలెంలో తన సోదరి ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న తలదాచుకున్న భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణను యాంటీ నక్సల్ స్క్వాడ్ (ఏఎన్‌ఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లుకి చెందిన అన్నపూర్ణ 1991నుంచి ఉద్యమంలో భాగస్వామ్యురాలైందన్నారు.

 
గత నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణ బంధువుల ఇంట్లో చికిత్స పొందుతోందని చెప్పారు. ఏఎన్‌ఎస్ పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళారని, ఆమెకు ఎలాంటి  ప్రాణహాని తలపెట్టినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అన్నపూర్ణపై ఏమైనా కేసులు ఉంటే వెంటనే ఆమెను కోర్టులో హాజరుపరచాలని లేకుంటే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. ఈ విలేకరుల సమావేశంలో  పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, రాష్ట్రకమిటీ సభ్యులు నల్లపాటి రామారావు , కెఎన్‌పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శిఖినం చిన్నా, పికెఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కంభాల ఏడుకొండలు, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి దండు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు