దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌ ‘ఏపీ’

19 Nov, 2023 08:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో ఘనత సాధించింది. ఏపీని దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్‌తో పాటు అవార్డును ప్రదానం చేయనున్నారు.

కాగా గతంలోనూ మన రాష్ట్రం ఇదే అవార్డును దక్కించు­కోవడం విశేషం. ఈ నేపథ్యంలో  మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ శాఖ అధికారులు, సిబ్బందికి ట్విట్టర్‌  ద్వారా  శనివారం అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు