టీడీపీ అరాచకాలపై ఐక్య పోరాటం

26 Oct, 2014 23:55 IST|Sakshi
టీడీపీ అరాచకాలపై ఐక్య పోరాటం

టీడీపీ అరాచకాలపై ఐక్యంగా పోరాడాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసారుురెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థారుు సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ అక్రమాలు, అరాచకాలపై ఐక్యంగా పోరాడదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చా రు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో ఉండటానికి భయపడేలా టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని, దీనిని నిలువరించేందుకు పార్టీలోని అన్ని శ్రేణులు కలసికట్టుగా పోరాడాలని కోరారు.  గుంటూరులోని వైన్ డీలర్స్ అసోసియేషన్ హాలులో ఆదివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థారుు సమావేశంలో ఆయన ప్రసంగి స్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు భరోసా కలిగించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అందకుం డా చేసేందుకు టీడీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందనీ, దీనిని అడ్డుకుంటామన్నా రు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. దీనికి వ్యతి రేకంగా వచ్చే నెల 5న తహశీల్దార్ కార్యాలయా ల ఎదుట నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో పార్టీ నేతలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, గుది బండి చినవెంకటరెడ్డి, కొత్తా చినప్పరెడ్డి,  ఆర్.రత్నకుమారి, బండారు సాయిబాబు, కావటి మనోహర్‌నాయుడు, విజయకిషోర్, కత్తెర సురేష్‌కుమార్, వెంకటప్పారెడ్డి, బి.నాగిరెడ్డి, నసీర్ అహ్మద్, మండేపూడి పురుషోత్తం, ఆళ్ళ పేర్రెడ్డి, మేరుగ విజయలక్ష్మి, జయలక్ష్మి, కొలకలూరి కోటేశ్వరరావు, చాంద్‌బాషా, బొల్లాపల్లి, బెల్లంకొండ జెడ్పీటీసీ సభ్యులు సంతోషమ్మ, దేవళ్ళ రేవతి పాల్గొన్నారు.
 
 ప్రజాసమస్యలపై పోరాడాలి
 టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా గతంలో ఉన్న పథకాలను అమలు చేయడంలో విఫలమైంది. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై పోరాడడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.
 - రావి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే
 
 ప్రతిఘటన తప్పదు
 టీడీపీ వారు దాడులు, కేసులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయపెడుతున్నారు. అణచివేత ఉన్నచోట ప్రతిఘటన కూడా ఉంటుంది. మాపై దాడులు చేసిన వారిపై కనీసం కేసులు నమోదు చేయలేదు. టీడీపీ దౌర్జన్యాలు ఎంతోకాలం సాగవు.
  -అంబటి రాంబాబు,
  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి
 
 చంద్రబాబుది వాగ్ధానాల మాఫీ
 ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన వాగ్దానాల మాఫీతో ప్రారంభమైంది. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, గీత కార్మికులు, మత్స్యకారుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. బెల్టుషాపులు రద్దు చేస్తామని చెప్పారు. ఒక్కటీ అమలు కాలేదు.     
 - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,
 త్రిసభ్య కమిటీ సభ్యుడు
 
 రాజధానిపై అయోమయం సృష్టిస్తున్నారు
 రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమని ఒకసారి, లక్ష ఎకరాలు కావాలంటూ మరోసారి సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తుండటంతో ప్రజలు అయోమయూనికి గురవుతున్నారు. రాజధానిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
 - ఆళ్ళ రామకృష్ణారెడ్డి,
 మంగళగిరి ఎమ్మెల్యే
 
 కార్యకర్తల కోసం ప్రాణాలు ఇస్తాం
 టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. కార్యకర్తలను కాపాడుకునేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయం. జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండేందుకు న్యాయవాదులను నియమిస్తాం. పల్నాడు పౌరుషాన్ని చూపుతూ ప్రజాసమస్యలపై ఉద్యమించాలి.
 - సుధాకర్‌రెడ్డి,
 వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు
 
 రూ.5 వేల కోట్లు వడ్డీకి కూడా చాలవు
 రుణ మాఫీపై కమిటీలు, సాధికారత కార్పొరేషన్ పేరిట రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నా రు. రుణ మాఫీని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారు. సాధికారత కార్పొరేషన్‌కు కేటారుుంచిన రూ. 5 వేల కోట్లు వడ్డీ చెల్లింపులకు కూడా సరిపోవు. రేషన్ బియ్యం, ఇసుకలను టీడీపీ నేతలు దోచుకుంటున్నారు.
 -మర్రి రాజశేఖర్,
 వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 
 
 మోసకారి ప్రభుత్వంపై పోరాడతాం
 తప్పుడు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజ లను మోసం చేస్తోంది. దీనిపై వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం దారుణం.  పింఛను కమిటీల ఏర్పాటుపై న్యాయపోరాటం చేస్తాం.
 -మోపిదేవి వెంకటరమణ,
 వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
 
 సరస్వతి భూములపై రాజకీయం
 సరస్వతి సిమెంట్స్ భూములపై టీడీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములను తిరిగి రైతులకు ఎలా ఇస్తారు? భూములపై రాజకీయంతో జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడానికి పూనుకుంటున్నారు. ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలి.
 -జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ రాష్ర్ట కార్యదర్శి
 
 కార్యకర్తలకు అండగా నిలవాలి
 టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేలా చట్టపరంగా ముందుకు సాగా లి. వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారనే నెపంతో పిం ఛన్లకు అర్హులైన లబ్ధిదారుల పేర్లను జాబితాల నుంచి తొలగించారు. రేషన్ బియ్యూన్ని టీడీపీ కార్యకర్తలు దోచుకుంటున్నారు.
 -గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,
 నరసరావుపేట ఎమ్మెల్యే
 
 జగన్ సీఎం అయ్యేవరకు పోరాడాలి
 ఎన్నికల సమయంలో రుణ మాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు సాధికారత కార్పొరేషన్ ద్వారా మాఫీ చేస్తాననడం దారుణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు కార్యకర్తలు ధైర్యంగా పనిచేయాలి.
 - షేక్ మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే
 
 అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడరు
 టీడీపీ నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలను ప్రజలు త్వరలోనే ఎండగడతారు. అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భయపడరు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. ఎస్సీలకు రుణాలు సరిగా అందటం లేదు.
 -సామినేని ఉదయభాను,
 మాజీ ఎమ్మెల్యే
 
 ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై నిర్లక్ష్యం
 ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. రుణాల కోసం ప్రజాప్రతి నిధు లు, కమిటీల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలకే పథకాలు అందేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
 - మేరుగ నాగార్జున,
 వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు
 
 ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమం
 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. అన్ని పథకాలు పచ్చచొక్కాలవారికే అందేలా కమిటీలు వేశారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ ఉద్యమించింది. ఎన్నికల హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమం నిర్వహిస్తాం.
 - లేళ్ళ అప్పిరెడ్డి,
 వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి
 
 టీడీపీ తీరుపై అవగాహన కల్పించాలి
 రుణ మాఫీపై టీడీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం ‘సాక్షి’ మెయిన్, జిల్లా ఎడిషన్లలో ప్రత్యేక పేజీలు ఇస్తున్నారు.
 - నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ
 రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్
 
 పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
 ప్రజాసమస్యలపై పోరాడటంతోపాటు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి పార్టీలకతీతంగా పథకాలను అమలు చేశారు. చంద్రబాబు పాలన దారుణంగా ఉంది. ఆయనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మంచి రోజులు ముందున్నాయి.
 -హెనిక్రిష్టినా,
 తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త

మరిన్ని వార్తలు