ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

24 Aug, 2014 01:26 IST|Sakshi
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
  • సివిల్స్ పరీక్ష కేంద్రాల పరిశీలకుడు, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్
  •   హాల్‌టికెట్, ఈ-అడ్మిట్ కార్డు తప్పనిసరిగా చూపించాలి
  •   సెల్‌ఫోన్లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు తీసుకురావద్దు
  • విజయవాడ: అఖిల భారత సివిల్ సర్వీసుల పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థుల్ని అనుమతించవద్దని పరీక్ష కేంద్రాల పరిశీలకుడు, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్ ఆదేశించారు. ఆదివారం నగరంలో జరగనున్న సివిల్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను శనివారం ఆయన పర్యవేక్షించారు.

    అనంతరం నలంద కళాశాలలో ఇన్విజిలేటర్లు, అసిస్టెంట్ సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. పరీక్ష సమయం దాటాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించవద్దన్నారు. కేంద్రాల వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో ముందస్తు ఏర్పాట్లను చేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించారు.

    అభ్యర్థులు హాల్ టికెట్, ఇ-అడ్మిట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలన్నారు. ఇన్విజిలేటర్లు, అభ్యర్థులు కేంద్రాల్లోకి సెల్‌ఫోనులు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు తీసుకురాకూడదన్నారు. నగరంలో మొట్టమొదటిసారిగా సివిల్స్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ ఆర్.ఆర్.పురి కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు