చంద్రబింబం: ఆగస్టు 24 నుండి 30 వరకు | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: ఆగస్టు 24 నుండి 30 వరకు

Published Sun, Aug 24 2014 1:21 AM

Funday Astrology of the week: August 24 to August 30

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 మొదట్లో పనులు మందగించినా క్రమేపీ పుంజుకుంటాయి. బంధువులు, మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిస్తాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయరంగం వారికి పదవులు. వారం మధ్యలో దూరప్రయాణాలు. శ్రమాధిక్యం.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అంతంతగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో వాహనయోగం.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనసౌఖ్యం.  ఆలయాల సందర్శనం.  విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ధనలాభం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళారంగం వారికి యోగవంతమైన కాలం. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులు, బంధువులతో వివాదాలు తీరతాయి. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని ప్రగతి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 ఈ వారం పట్టింది బంగారమే. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకోని ర్యాంకులు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పైస్థాయి అధికారుల ప్రశంసలు. కళారంగం వారికి అవార్డులు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 ప్రారంభంలో నెలకొన్న సమస్యలు క్రమేపీ తొలగుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. భూవివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ఆర్థిక లావాదేవీలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవ ర్గాలకు పదవీయోగం. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. భూ, గృహయోగాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం.
 

- సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

Advertisement
Advertisement