బాలకార్మికుల అక్రమరవాణా గుట్టు రట్టు

21 Jun, 2015 20:40 IST|Sakshi
నెల్లూరు సీడబ్ల్యూసీ అధికారుల అదుపులో ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన బాలలు

- ముగ్గురు పిల్లలతో సహా పరారైన ఏజెంట్

నెల్లూరు:
విజయనగరం జిల్లాకు చెందిన 10 మంది బాలబాలికలను కార్మికులుగా మార్చి నెల్లూరులో పనిలో కుదిర్చేందుకు ప్రయత్నించిన ఓ ముఠా గుట్టు రట్టయింది. విజయనగరం నుంచి బాలకార్మికులను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న నెల్లూరు సీడబ్ల్యూసీ అధికారులు ఆదివారం నెల్లూరు రైల్వే స్టేషన్లో కాపుకాశారు. రైలు దిగుతూ ఈ విషయాన్ని గమనించిన బాలకార్మికుల ఏజెంట్ ముగ్గురు పిల్లలతో సహా పరారయ్యాడు.

కాగా, మిగిలిన ఏడుగురు బాలల్ని అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ నెల్లూరులోని బీఎమ్‌ఆర్ హ్యాచరీస్‌లో పని చేయడం కోసం తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. సదరు బీఎమ్‌ఆర్ హ్యాచరీస్ కంపెనీ టీడీపీ ఎమ్మెల్సీ రవిచంద్రకు చెందిందిగా సమాచారం. పరారయిన ఏజెంట్ అజిత్ సహా ముగ్గురు పోలీసుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు