బాలికపై లైంగిక దాడి | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి

Published Sun, Jun 21 2015 8:55 PM

yuoth raped minor girl

బెరైడ్డిపల్లి (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లి ఎస్సీ కాలనీలో ఓ బాలికపై లైంగికదాడి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుమేరకు బైరెడ్డిపల్లి ఎస్సై ఎస్ఐ కృష్ణమోహన్ కేసు నమోదుచేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బెరైడ్డిపల్లి ఎస్సీ కాలనీలో బాలిక(16) శనివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే కాలనీకి చెందిన సురేష్(23) లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయింది.

చాలా సేపటితర్వాత ఇంటికి వచ్చిన తల్లి కూతురి పరిస్థితిచూసి విలవిలలాడిపోయింది. విషయం తెలుకుని పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఐసీడీఎస్ సీడీపీఓ రాజేశ్వరి, సూపర్‌వైజర్ స్వరూపలు స్పందించి ఆదివారం ఆ బాలికను చికిత్స నిమిత్తం పలవునేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్(1098) సిబ్బంది భాను, కువూరి, ఈశ్వరి బాధితురాలిని పరావుర్శించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడికోసం గాలిస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Advertisement
Advertisement