రేషన్‌కార్డులు లేక..పథకాలకు నోచుకోక

6 Mar, 2019 15:36 IST|Sakshi

సాక్షి, చీపురుపల్లి రూరల్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్‌కార్డు ఎంతో అవసరం. అలాంటి రేషన్‌కార్డు లేకపోతే ప్రభుత్వం ప్రతీ నెలా అందజేస్తున్న రేషన్‌ సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలకు కూడా దూరమవ్వాల్సిందే. ఇది ఏ ఒక్క రూ కాదనలేని నిజం. ప్రజలకు ఏవేవో చేసేశాం, ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్‌కార్డులను మంజూరు చేయడంలో ఎంతో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేందుకు పీకే పాలవలస ఒక ఉదాహరణ. ఈ గ్రామానికి చెందిన గవిడి గొల్లబాబు గత మూడున్నర ఏళ్లుగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేస్తునే ఉన్నాడు.

కొత్త రేషన్‌కార్డు రావాలంటే భార్య, భర్తల పేర్లు ఏ ఒక్క కార్డులో కూడా ఉండకూడదనే నిబంధన ఉంది. ఈ క్రమంలో కొత్త కార్డు వస్తుందనే ఆశతో తల్లిదండ్రుల కార్డులో ఉన్న పేరును గొల్లబాబు తొలగించాడు. అదే విధంగా భార్య పేరును కూ డా ఆమె తల్లిదండ్రుల కార్డులో నుంచి తొలగించా డు. ప్రతీ జన్మభూమి సభలో దరఖాస్తు చేసుకోవడమే తప్ప రేషన్‌కార్డు మాత్రం రావడం లేదు. దీంతో భార్య, భర్తలతో పాటుగా పిల్లలు సైతం ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. ఇది ఈ ఒక్కడి సమస్య కాదు నియోజకవర్గంలోని వందలాది మంది సమస్య. రేషన్‌ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. కార్డులు లేక పథకాలకు నోచుకోలేకపోతున్నారు.

ప్రయోజనం లేని జన్మభూమి సభలు 
ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన జన్మభూమిలో వందల సంఖ్యలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు వచ్చినప్పటికీ ఏ ఒక్కరికీ మంజూరైన దాఖలా లు లేవు. గత నాలుగేళ్లుగా జరిగిన జన్మభూమి సభల్లో కూడా వందల సంఖ్యలో రేషన్‌కార్డులు దరఖాస్తు చేస్తే పదుల సంఖ్యలో మాత్రమే మంజూరయ్యాయి. దీంతో అర్హులందరికీ నిరాశ తప్పడం లేదు. పేద ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో ఈ ఒక్క రేషన్‌ కార్డు విషయంలోనే స్పష్టమవుతోందని పలువురు మండిపడుతున్నారు.

55 మంది ఎదురు చూపు
మండలంలోని ఒక్క పీకే పాలవలస గ్రామంలోనే 55 మంది అర్హులు రేషన్‌కార్డుల కోసం ప్రతీ సారి దరఖాస్తు చేసుకొని మోసపోతున్నారు. గ్రామానికి విచ్చేసిన రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులను నిలదీస్తే మేమేమీ చేయలేం, మా చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారని స్థానిక విలేకర్లతో తమ గోడు చెప్పుకుంటున్నారు. రేషన్‌కార్డు కోసం 1100కి ఎప్పుడు ఫోన్‌ చేసినా, ప్రోసెస్‌లో ఉన్నాయని చెబుతున్నారని తెలిపారు.

దీంతో చేసేదేమీ లేక కలెక్టర్‌ గ్రీవెన్‌సెల్‌లో కూడా ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఏ ఒక్క అధికా రి కూడా గ్రామంలోకి రాలేదని వారు వాపోతున్నారు. రెండోసారి గ్రీవెన్‌సెల్‌లో అడిగితే మండ ల రెవెన్యూ అధికారులకు వివరాలంతా పంపిం చామని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద ప్రస్తావిస్తే కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. 

మరిన్ని వార్తలు