‘అందరికీ ఇళ్ల పథకంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం’

20 May, 2020 13:14 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: అంఫన్ తుపాన్‌ వల్ల సముద్రంలో ఎగిసిపడిన అలల తీవ్రతకు నేలకొరిగి ఇళ్లకు ‘అందరికి ఇళ్లు’ పథకంలో కొత్త ఇళ్లని నిర్మిస్తామని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. ఆయన బుధవారం తుపాన్‌ ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. సూరడాపేట, మాయపట్నం,ఉప్పాడలో కోతకు గురైన ప్రాంతాలను కాకినాడ ఆర్డివో చిన్నకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం, తాగు నీరు సదుపాయం అందిస్తున్నామని తెలిపారు. (తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?)

ఉప్పాడ తీరం కోతకు గురి కాకుండా ఆధునిక పరిజ్ఞానంతో దివంగత నేత వైఎస్సార్‌ జియా ట్యూబ్‌ను నిర్మించారని ఆయన గుర్తు చేశారు. కానీ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ‘జియో ట్యూబ్’ పూర్తిగా శిధిలమైందన్నారు. జియో ట్యూబ్‌తో పాటుగా తుఫాన్‌కు దెబ్బతిన్న ఉప్పాడ-కాకినాడ రాక్ వాల్ విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. 

మరిన్ని వార్తలు