‘ఆహ్లా’దం.. అద్భుతం

24 Jul, 2015 02:26 IST|Sakshi
‘ఆహ్లా’దం.. అద్భుతం

- గోదావరి అందాలకు యాత్రికుల పరవశం
- చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన
సాక్షి,రాజమండ్రి :
పుష్కరాలకు పోటెత్తుతున్న యాత్రికులు అటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటక , ఆధ్యాత్మిక  కేంద్రాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పుష్కర స్నానాలు పూర్తిచేసి పర్యాటక కేంద్రాల సందర్శనలకు బయల్దేరుతున్నారు. గోదావరి అందాలను చూసి ఆనందలో మునిగితేలుతున్నారు. కాటన్‌దొర గొప్పదనాన్ని కొనియాడుతున్నారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన పాపికొండలు, పట్టిసీమ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజినీ చూసేందుకు వస్తున్నారు.

బ్యారేజీ పక్కనే ఉన్న కాటన్ మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. బొమ్మూరు మిట్టలో కాటన్‌దొర నివాసమున్న ఇంటిని సైతం సందర్శిస్తున్నారు. ఇక రాజమండ్రి గోదావరి ఒడ్డున ఉన్న ఇస్కాన్‌టెంపుల్,  కందుకూరి వీరేశలింగం పంతులు నివాస గృహాన్ని పుష్కర యాత్రికులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. ప్రభుత్వ  పురావస్తు శాఖ  ఆధ్వర్యంలో నడుస్తున్న రాల్లబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలను  సైతం  పుష్కర యా త్రికులు సందర్శిస్తున్నారు. మ్యూజియంలోని శిల్పకళను తిలకిస్తున్నారు.  వీటితో పాటు  ఉభయ గోదారిజిల్లాలలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సైతం  పుష్కర భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు