హెరిటేజ్‌ మేనేజర్‌ కల్తీ దందా

28 Jul, 2019 11:08 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న భీమడోలు సీఐ సుబ్బారావు, ఎస్సై రామ్‌కుమార్‌

కొత్తపల్లికి చెందిన వ్యక్తితో కలిసి పాల కల్తీ దందా

పోలీసుల దాడిలో బట్టబయలు

దెందులూరు: వెన్నశాతం పెరిగేందుకు పాలను కల్తీ చేస్తున్న ఉదంతమిది. హెరిటేజ్‌ కంపెనీ మేనేజర్‌ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడుతుండడం గమనార్హం. పాలల్లో వెన్నశాతం పెరిగేందుకు సన్‌ఫ్లవర్‌ ఆయిల్, యూరియా తదితర వస్తువులను కలుపుతున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగానికి దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామం వేదికైంది. శనివారం దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హెరిటేజ్‌ కంపెనీ (సూరప్పగూడెం) యూనిట్‌ మేనేజర్‌ మంగారావు, దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుత్తుల హరిమీరారావు సహకారంతో పాలకల్తీకి తెరతీశారన్నారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి, దెందులూరు కానిస్టేబుళ్లు కొత్తపల్లి గ్రామంలో పాలకల్తీ జరుగుతున్న గుత్తుల హరిమీరారావు ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారన్నారు. కల్తీ పాలు ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఏయే కంపెనీలకు సరఫరా చేస్తున్నారు, ఎంతమేర కల్తీ జరుగుతుంది, సూత్రదారులు, పాత్రదారులు ఎవరు, ఆర్థిక సహకారం ఎవరందిస్తున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. సంఘటనా స్థలంలో యూరియా, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్లు, కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు గుత్తుల హరిమీరారావును అరెస్ట్‌ చేసి శనివారం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భర్త ముందే భార్యతో ఫోన్‌లో..

వైద్యం.. ప్రైవేట్‌ రాజ్యం..! 

నో ట్రిక్‌.. ఇక బయోమెట్రిక్‌

వంశధార స్థలం ఆక్రమణ వాస్తవమే..

బోల్‌ భం భక్తుల దుర్మరణం

క్షణ క్షణం.. భయం భయం

గ్రామసచివాలయాల్లో కొలువుల జాతర

నిధుల కొరత లేదు: మంత్రి బుగ్గన

టిక్‌‘ట్రాప్‌’లో శక్తి టీమ్‌ 

ఆ భోజనం అధ్వానం

మంత్రి అవంతి గరం గరం..

రైల్వే ప్రయాణికుడి వీరంగం

వీరులార మీకు పరి పరి దండాలు!

చేతకాకపోతే చెప్పండి.. వెళ్లిపోతాం!

అమాయకుడిపై ఖాకీ ప్రతాపం 

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

80% ఉద్యోగాలు స్థానికులకే.. 

నా కుమారుడు చచ్చినా పర్వాలేదు

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

దావోస్‌లో ఏపీ లాంజ్‌ ఖర్చు రూ.17 కోట్లు

ప్రభుత్వ మద్యం షాపులకు ప్రతిపాదనలు సిద్ధం!

యజ్ఞంలా ‘నివాస స్థలాల’ భూసేకరణ 

‘జగతి’ ఎఫ్‌డీఆర్‌ను వెంటనే విడుదల చేయండి 

ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఇక పక్కాగా..

విశాఖ ఏజెన్సీని ముంచెత్తిన వర్షాలు

గాంధీ జయంతి నుంచి.. గ్రామ సురాజ్యం

పెట్టబడుల ఆకర్షణకై రాష్ట్ర ప్రభుత్వం భారీ సదస్సు

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి